Breaking News

‘కీబోర్డ్‌ వారియర్స్‌’ను సైలెంట్‌ చేశా

Published on Thu, 07/17/2025 - 04:01

లండన్‌: సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ తన ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించడం ఆనందంగా ఉందని అన్నాడు. ఈ క్రమంలో ఆర్చర్‌ విమర్శకులను ఉద్దేశించి ‘కీబోర్డ్‌ వారియర్స్‌’ అనే పదాన్ని ఉపయోగించాడు. 2021లో చివరిసారి ఇంగ్లండ్‌ తరఫున టెస్టు మ్యాచ్‌ ఆడిన ఆర్చర్‌... టీమిండియాతో జరిగిన లార్డ్స్‌ టెస్టుతో పునరాగమనం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లతో ఫర్వాలేదనిపించిన ఆర్చర్‌... రెండో ఇన్నింగ్స్‌లో మూడు కీలక వికెట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

‘ఇది సుదీర్ఘ ప్రయాణం. ఇన్నాళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చి విజయంలో భాగమవడం సంతోషంగా ఉంది. గత మూడు నాలుగేళ్లుగా ఎంతమంది ‘కీబోర్డ్‌ వారియర్స్‌’ నన్ను లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేశారో లెక్కచెప్పలేను. ఎన్నో గాయాలు, మరెన్నో పునరావాస శిబిరాల తర్వాత వచ్చిన ఈ గెలుపు చాలా ప్రత్యేకం’ అని ఆర్చర్‌ అన్నాడు. మోచేయి, వెన్నునొప్పి, కండరాలు ఇలా ఎన్నో గాయాల బారిన పడిన 30 ఏళ్ల ఆర్చర్‌... గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌ మాత్రమే ఆడుతున్నాడు. 

ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సంతరించుకోవడంతో సుదీర్ఘ ఫార్మాట్‌లో తిరిగి అడుగు పెట్టాడు. భారత రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌తో పాటు పంత్, వాషింగ్టన్‌ సుందర్‌ను ఆర్చర్‌ పెవిలియన్‌కు పంపాడు. పంత్‌ వికెట్‌తో జట్టులో నూతనోత్సాహం వచ్చిందని ఆర్చర్‌ వెల్లడించాడు. ‘ఇన్నాళ్ల తర్వాత ఆడిన తొలి టెస్టులో నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్‌ చేశా. ఇది శుభసూచకం. పంత్‌ వికెట్‌తో జట్టులో కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ తర్వాత మరింత పట్టుబిగించగలిగాం’ అని ఆర్చర్‌ అన్నాడు. 

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సోమవారం లార్డ్స్‌ వేదికగా ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ 22 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ సిరీస్‌లో ఆతిథ్య జట్టు ప్రస్తుతం 2–1తో ఆధిక్యంలో ఉండగా... ఇరు జట్ల మధ్య ఈ నెల 23 నుంచి మాంచెస్టర్‌లో నాలుగో మ్యాచ్‌ ప్రారంభం కానుంది.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)