Breaking News

సెంచరీతో కదం తొక్కిన పుజారా.. తేలిపోయిన పృథ్వీ షా

Published on Mon, 08/07/2023 - 15:57

2021-23 డబ్ల్యూటీసీ ఫైనల్‌ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా టెస్ట్‌ బ్యాటర్‌, నయా వాల్‌ చతేశ్వర్‌ పుజారా ఇంగ్లండ్‌ దేశవాలీ వన్డే కప్‌లో సెంచరీతో కదం తొక్కాడు. టోర్నీలో భాగంగా నార్తంప్టన్‌షైర్‌తో నిన్న (ఆగస్ట్‌ 6) జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకంతో (119 బంతుల్లో 106 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిశాడు. టీమిండియాలో చోటు కోల్పోయాక కసితో రగిలిపోతున్న పుజారా.. తన తాజా ఇన్నింగ్స్‌తో భారత సెలెక్టర్లకు సవాలు విసిరాడు. ఈ మ్యాచ్‌లో పుజారా ఇన్నింగ్స్‌ సాగిన తీరు పై పేర్కొన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. పుజారా సెంచరీతో చెలరేగినా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ససెక్స్‌ ఓటమిపాలవ్వడం కొసమెరుపు. 

వర్షం కారణంగా 45 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ససెక్స్‌.. పుజారా శతకొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ససెక్స్‌ ఇన్నింగ్స్‌లో పుజారా మినహా ఎవరూ రాణించలేదు. కెప్టెన్‌ టామ్‌ హెయిన్స్‌ (13), జేమ్స్‌ కోల్స్‌ (29), హడ్సన్‌ (14), ఒలివర్‌ కార్టర్‌ (21), జాక్‌ కార్సన్‌ (17), హెన్రీ క్రొకోంబ్‌ (14 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. నార్తంప్టన్‌షైర్ బౌలర్లలో జాక్‌ వైట్‌ 3, ప్రాక్టర్‌, కియోగ్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు.

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తేలిపోయిన పృధ్వీ షా..
గ్లోసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌తో ఇంగ్లండ్‌ దేశవాలీ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భారత యువ ఓపెనర్‌ పృథ్వీ షా.. ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో  విఫలమయ్యాడు. గ్లోసెస్టర్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లో 34 పరుగులు చేసి విచిత్ర రీతిలో ఔటైన (హిట్‌ వికెట్‌) షా.. తాజాగా ససెక్స్‌తో జరిగిన తన రెండో మ్యాచ్‌లోనూ తక్కువ స్కోర్‌కే (17 బంతుల్లో 26; 4 ఫోర్లు) పరిమితమయ్యాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌ల్లో షాకు మంచి ఆరంభమే లభించినా, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. షా భారీ స్కోర్‌ చేయకపోయినా, మిగతా వారు రాణించడంతో అతని జట్టు విజయం సాధించింది. 

ససెక్స్‌తో మ్యాచ్‌లో 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్తంప్టన్‌షైర్.. మరో 8 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నార్తంప్టన్‌షైర్ ఆటగాళ్లు తలో చేయి వేసి తమ జట్టును గెలిపించుకున్నారు. షాతో పాటు రికార్డో (37), సామ్‌ వైట్‌మ్యాన్‌ (30), రాబ్‌ కియోగ్‌ (22), లూక్‌ ప్రాక్టర్‌ (10), లెవిస్‌ మెక్‌మానస్‌ (36) రెండంకెల స్కోర్లు చేయగా.. టామ్‌ టేలర్‌ (42 నాటౌట్‌), జస్టిన్‌ బ్రాడ్‌ (22 నాటౌట్‌) నార్తంప్టన్‌షైర్‌ను విజయతీరాలకు చేర్చారు. ససెక్స్‌ బౌలర్లలో కర్రీ, కార్సన్‌ చెరో 2 వికెట్లు, క్రొకోంబ్‌, హడ్సన్‌, జేమ్స్‌ కోల్స్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)