భారత్‌తో మూడో టీ20.. ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన

Published on Mon, 01/27/2025 - 19:24

రాజ్‌కోట్ వేదిక‌గా మంగళవారం(జనవరి 28) భారత్‌తో మూడో టీ20లో తలపడేందుకు ఇంగ్లండ్ సన్నదమవుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన ఇంగ్లండ్ జట్టు.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో నిలవాలని భావిస్తోంది. ఇప్పటికే రాజ్‌కోట్‌కు చేరుకున్న బట్లర్ సేన సోమవారం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో మూడో టీ20కు ఇంగ్లండ్ క్రికెట్ తమ తుది జట్టును ప్రకటించింది.

తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇంగ్లండ్ ఎటువంటి మార్పులు చేయలేదు. చెపాక్ టీ20లో ఆడిన జట్టునే మూడో మ్యాచ్‌కు కూడా కొనసాగించారు. చివరి మ్యాచ్‌లో ఆకట్టుకున్న జేమీ స్మిత్‌, బ్రైడన్ కార్స్ తమ స్దానాలను సుస్థిరం చేసుకున్నారు. రెండో టీ20లో బ్రైడన్ కార్స్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్‌లో 31 పరుగులతో పాటు బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లను కార్స్ తీసుకున్నాడు.

అదే విధంగా తొలి రెండు​ మ్యాచ్‌ల్లో విఫలమైన ఫిల్ సాల్ట్‌, బెన్ డకెట్‌లకు ఇంగ్లండ్ మెనెజ్‌మెంట్ మరో అవకాశమిచ్చింది. విధ్వంస‌క‌ర ఆట‌గాడిగా పేరు గాంచిన సాల్ట్ తొలి రెండు టీ20ల్లో వ‌రుస‌గా 0,6 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. డ‌కెట్‌ది కూడా అదే తీరు. కోల్‌క‌తాలో 4 ప‌రుగులు చేసిన డ‌కెట్‌.. చెపాక్‌లో కేవ‌లం మూడు ప‌రుగులు మాత్రమే చేశాడు.

మ‌రోవైపు లైమ్ లివింగ్ స్టోన్ కూడా త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోతున్నాడు. మిడిలార్డ‌ర్‌లో అత‌డి వైఫ‌ల్యం ఇంగ్లండ్‌కు ప్ర‌ధాన స‌మ‌స్యగా మారింది. ఈ మ్యాచ్‌లో వీరు రాణించకపోతే తదుపరి మ్యాచ్‌కు వేటు పడే ఛాన్స్ ఉంది. అయితే టాప్ క్లాస్ బ్యాట‌ర్లు సైతం విఫ‌ల‌మ‌కావ‌డంతో కెప్టెన్ జోస్ బ‌ట్లర్‌పై ఒత్త‌డి పెరుగుతుంది.

తొలి టీ20లో 68 ప‌రుగుల‌తో కెప్టెన్ నాక్ ఆడిన జోస్‌.. రెండో మ్యాచ్‌లోనూ 45 ప‌రుగులతో రాణించాడు. కాగా ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ ప్రస్తుతం 0-2తో వెనుకబడి ఉంది. ఇంగ్లండ్ జట్టు సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే రాజ్‌కోట్‌లో తప్పకగెలవాల్సిందే.

ఇక మూడో టీ20లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగే సూచనలు కన్పిస్తున్నాయి. ధ్రువ్ జురెల్ స్ధానంలో శివమ్ దూబే, రవి బిష్ణోయ్ ప్లేస్‌లో మహ్మద్ షమీ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. భార‌త్ బ్యాటింగ్‌, బౌలింగ్ విభాగాల్లో ప‌టిష్టంగా క‌న్పిస్తోంది. అభిషేక్ శ‌ర్మ‌, తిల‌క్ వ‌ర్మ, అర్ష్‌దీప్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి అద్బుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. దీంతో మ‌రోసారి ఇంగ్లీష్ జ‌ట్టుకు క‌ఠిన స‌వాలు ఎదురుకానుంది.

మూడో టీ20కు ఇంగ్లండ్ తుది జ‌ట్టు
బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్‌), జోస్ బట్లర్ (కెప్టెన్‌), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

భారత తుది జట్టు(అంచనా)
సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివ‌మ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మ‌హ్మ‌ద్ షమీ, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో మూడో టీ20.. భారత జట్టులోకి ఇద్దరు స్టార్‌ ప్లేయర్లు?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)