Breaking News

342 పరుగుల తేడాతో...

Published on Mon, 09/08/2025 - 00:57

సౌతాంప్టన్‌: వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇంగ్లండ్‌ జట్టు అరుదైన రికార్డు తమ పేరిట లిఖించకుంది. దక్షిణాఫ్రికాతో తొలి రెండు వన్డేల్లో ఓడి ఇప్పటికే సిరీస్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌ జట్టు ఆఖరి వన్డేలో విశ్వరూపం కనబర్చింది. బ్యాటర్ల జోరుకు బౌలర్ల విజృంభణ తోడవడంతో ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 342 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. 

అంతర్జాతీయ వన్డేల్లో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం కాగా... రెండేళ్ల క్రితం శ్రీలంకపై భారత్‌ నమోదు చేసుకున్న 317 పరుగుల గెలుపు రెండో స్థానానికి చేరింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 414 పరుగులు చేసింది. 

21 ఏళ్ల జాకబ్‌ బెథెల్‌ (82 బంతుల్లో 110; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు), సీనియర్‌ ప్లేయర్‌ జో రూట్‌ (96 బంతుల్లో 100; 6 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కగా... జేమీ స్మిత్‌ (48 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్‌), జోస్‌ బట్లర్‌ (32 బంతుల్లో 62 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఆరంభం నుంచే ఇంగ్లండ్‌ బ్యాటర్లు ధాటిగా ఆడగా... ఆఖర్లో బట్లర్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోరు అందించాడు.

 దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహరాజ్, కార్బిన్‌ బాష్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 20.5 ఓవర్లలో 72 పరుగులకే ఆలౌటైంది. గత రెండు మ్యాచ్‌ల్లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న సఫారీలు... భారీ లక్ష్యఛేదనలో పోరాడకుండానే చేతులెత్తేశారు. కార్బిన్‌ బాష్‌ (20), కేశవ్‌ మహరాజ్‌ (17), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మార్క్‌రమ్‌ (0), రికెల్టన్‌ (1), ముల్డర్‌ (0), బ్రిట్జ్‌కీ (4), బ్రేవిస్‌ (6) విఫలమయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ (4/18), ఆదిల్‌ రషీద్‌ (3/13) విజృంభించారు. ఆర్చర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... రూట్, కేశవ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి టి20 సిరీస్‌ ప్రారంభం కానుంది.    

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు