Breaking News

ఇంగ్లండ్‌ బ్యాటర్ల విలయతాండవం.. మూడో టీ20లో భారీ స్కోర్‌

Published on Wed, 06/11/2025 - 06:57

స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్‌ 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. నిన్న (జూన్‌ 10) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో ఇంగ్లండ్‌ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్లు విలయతాండవం చేశాడు. తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ చేశారు. 

ఓపెనర్లు బెన్‌ డకెట్‌ (46 బంతుల్లో 84; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), జేమీ స్మిత్‌ (26 బంతుల్లో 60; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. అనంతరం వచ్చిన జోస్‌ బట్లర్‌ (10 బంతుల్లో 22; ఫోర్‌, 2 సిక్సర్లు), హ్యారీ బ్రూక్‌ (22 బంతుల్లో 35 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జేకబ్‌ బేతెల్‌ (16 బంతుల్లో 26 నాటౌట్‌; ఫోర్‌, 4 సిక్సర్లు) అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. 

ఫలితంగా ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. విండీస్‌ బౌలర్లలో అకీల్‌ హొసేన్‌, గుడకేశ్‌ మోటీ, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్‌ తొలుత వరుస విరామాల్లో వికెట్లు​ కోల్పోయింది. ఆ జట్టు టాపార్డర్‌ బ్యాటర్లు ఎవిన్‌ లెవిస్‌ 9, జాన్సన్‌ ఛార్లెస్‌ 9, షాయ్‌ హోప్‌ 45 (27 బంతుల్లో), షిమ్రోన్‌ హెట్‌మైర్‌ 26 (8 బంతుల్లో), రూథర్‌ఫోర్డ్‌ 1 పరుగుకు ఔటయ్యాడు. 

ఈ దశలో పోరాడితే పోయేదేముందున్నట్లు రెచ్చిపోయిన రోవ్‌మన్‌ పావెల్‌ 45 బంతుల్లో అజేయమైన 79 పరుగులు చేసి విండీస్‌ను గెలిపించే ప్రయత్నం చేశాడు. అతనికి జేసన్‌ హోల్డర్‌ (12 బంతుల్లో 25) జత కలిశాడు. అయినా లక్ష్యం మరీ పెద్దది కావడంతో విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 211 పరుగులకే పరిమితమైంది. తద్వారా మ్యాచ్‌ కోల్పోవడమే కాకుండా, క్లీన్‌ స్వీప్‌ పరాభవాన్ని కూడా తప్పించుకోలేకపోయింది. 

ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో కూడా విండీస్‌ ఇలాంటి పరాజయాలే ఎదుర్కొంది. దీనికి ముందు విండీస్‌ ఇదే ఇంగ్లండ్‌ చేతిలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కూడా 0-3 తేడాతో కోల్పోయింది. ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్‌కు ఇది తొలి అసైన్‌మెంట్‌. అరంగేట్రంలోనే రెండు సిరీస్‌లకు క్లీన్‌ స్వీప్‌ చేసిన బ్రూక్‌..  కెప్టెన్సీ కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)