Breaking News

తొలి టెస్టు.. శ్రీలంక‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌

Published on Sun, 08/25/2024 - 08:13

శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్‌ శుభారంభం చేసింది. మాంచెస్టర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 204/6తో శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన శ్రీలంక.. 326 పరుగులకు ఆలౌటైంది. 

కమిందు మెండిస్‌ (183 బంతుల్లో 113; 15 ఫోర్లు, ఒక సిక్సర్‌) సెంచరీతో రాణించి ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని నిర్దేశించేందుకు ప్రయత్నించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్, మాథ్యూ పాట్స్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం 205 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌ 57.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. 

మాజీ కెప్టెన్‌ జో రూట్‌ (128 బంతుల్లో 62 నాటౌట్‌; 2 ఫోర్లు), జేమీ స్మిత్‌ (48 బంతుల్లో 39; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌), డాన్‌ లారెన్స్‌ (54 బంతుల్లో 34; 2 ఫోర్లు, ఒక సిక్సర్‌), హ్యారీ బ్రూక్‌ (68 బంతుల్లో 32; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో, ప్రభాత్‌ జయసూర్య చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య లార్డ్స్‌ వేదికగా గురువారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.  
స్కోర్లు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌: 236/10
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌:358/10
శ్రీలంక సెకెండ్‌ ఇన్నింగ్స్‌:326/10
ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌:205/5

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)