ఇంగ్లండ్ బ్యాటర్ల విధ్వంసం.. వన్డేల్లో భారీ స్కోర్‌! భార‌త్ రికార్డు స‌మం

Published on Sun, 09/07/2025 - 20:44

సౌతాంప్టన్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న నామ‌మాత్ర‌పు మూడో వ‌న్డేలో ఇంగ్లండ్ బ్యాటర్లు జూలు విధిల్చారు. సిరీస్ కోల్పోయిన క‌సిని ఆఖ‌రి మ్యాచ్‌లో చూపించేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల నష్టానికి 414 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

తొలుత ఇంగ్లండ్‌కు ఓపెనర్లు బెన్‌ డకెట్‌(31), జేమీ స్మిత్‌(48 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 62) తొలి వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత సీనియర్ బ్యాటర్ జో రూట్‌(96 బంతుల్లో 6 ఫోర్లతో 100), యువ ఆటగాడు జాకబ్‌ బెతల్‌( 82 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 110) సెంచరీలతో కదం తొక్కారు.

 వీరిద్దరూ మూడో వికెట్‌కు 181 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రూట్ ఆచితూచి ఆడితే.. స్మిత్ మాత్రం టీ20 తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. బెతల్‌కు ఇదే తొలి వన్డే సెంచరీ కావడం విశేషం. వీరిద్దరూ ఔటయ్యాక జోజ్ బట్లర్‌(62 నాటౌట్‌), విల్ జాక్స్ మెరుపులు మెరిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బాష్‌, కేశవ్ మహారాజ్ తలా రెండు వికెట్లు సాధించారు. సౌతాఫ్రికా అరంగేట్ర పేసర్ యూసఫ్ వికెట్ ఏమీ తీయకుండా 80 పరుగులు సమర్పించుకున్నాడు.

ఇక ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ సాధించిన ఇంగ్లండ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సార్లు 400కు పైగా స్కోర్లు సాధించిన రెండో జట్టుగా టీమిండియా సరసన ఇంగ్లండ్ నిలిచింది. ఇంగ్లండ్ 7 సార్లు 400 ప్లస్ స్కోర్లు చేయగా.. భారత్ కూడా సరిగ్గా ఏడు సార్లు 400కు పైగా స్కోర్లు నమోదు చేసింది. ఈ జాబితాలో సౌతాఫ్రికా (8 సార్లు) అగ్రస్ధానంలో ఉంది.
చదవండి: ఖాళీ కడుపుతోనే పాక్‌పై సెంచరీ చేశా: వీరేంద్ర సెహ్వాగ్
 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)