మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
ఇంగ్లండ్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి!
Published on Sun, 11/13/2022 - 20:47
టీ20 ప్రపంచకప్-2022 ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టు అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో ప్రపంచ చాంపియన్లుగా ఉంటూనే టీ20 చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఇప్పటికే 2019లో వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి తొలి ప్రపంచకప్ టైటిల్‌ను ఇంగ్లండ్ ముద్దాడింది.
ఇప్పుడు పాకిస్తాన్‌కు చిత్తు చేసి మరోమారు పొట్టి ప్రపంచకప్‌ను ఇంగ్లీష్ జట్టు సొంతం చేసుకుంది. దీంతో ఈ అరుదైన ఘనత ఇంగ్లండ్ తమ ఖాతాలో వేసుకుంది. కాగా 2023లో వన్డే ప్రపంచకప్ ముగిసేంత వరకు.. 2024 నాటి టీ20 వరల్డ్‌కప్ సమరం పూర్తయ్యేవరకు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఛాంపియన్ హోదాలో ఇంగ్లండ్ ఉండనుంది.
ఇక ఓవరాల్‌గా ఇంగ్లండ్ ఖాతాలో మొత్తం మూడు ఐసీసీ వరల్డ్‌కప్ టైటిల్స్ ఉన్నాయి. అదే విధంగా రెండు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్స్‌గా నిలిచిన రెండో జట్టుగా ఇంగ్లండ్ అవతరించింది. అంతకుముందు వెస్టిండీస్ 2012, 2016లో విశ్వ విజేతగా నిలిచింది.
చదవండి: T20 WC 2022: ‘సారీ బ్రదర్... దీన్నే కర్మ అంటారు' అక్తర్‌కి కౌంటర్ ఇచ్చిన షమీ
Tags : 1