Breaking News

విండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌.. 238 పరుగుల తేడాతో విక్టరీ

Published on Fri, 05/30/2025 - 08:42

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌ శుభారంభం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్‌ 238 పరుగుల తేడాతో విండీస్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసింది. బ్రూక్‌ కెప్టెన్సీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌ భారీ స్కోరుతో విజృంభించింది. 

జాకబ్‌ బెథెల్‌ (53 బంతుల్లో 82; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు), బెన్‌ డకెట్‌ (60; 6 ఫోర్లు, 1 సిక్స్‌), జో రూట్‌ (57; 5 ఫోర్లు), హ్యారీ బ్రూక్‌ (58; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టారు. జెమీ స్మిత్‌ (37), బట్లర్‌ (37), విల్‌ జాక్స్‌ (39) కూడా రాణించారు. విండీస్‌ బౌలర్లలో జైడెన్‌ సీల్స్‌ 4, అల్జారీ జోసెఫ్, జస్టిన్‌ గ్రేవ్స్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. 

అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌ 26.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. జైడెన్‌ సీల్స్‌ (29; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెపె్టన్‌ షై హోప్‌ (25) కాస్త పోరాడగా... మిగిలిన వాళ్లు ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో సాఖీబ్‌ మహమూద్, జేమీ ఓవర్టన్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే జరగనుంది.
చదవండి: నేను అత‌డికి పెద్ద అభిమానిని.. ఇంకా ఒకే ఒక మ్యాచ్‌: ఆర్సీబీ కెప్టెన్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)