Breaking News

శ్రీలంకను చిత్తు చేసిన ఇంగ్లండ్‌.. 190 పరుగుల తేడాతో భారీ విజయం

Published on Mon, 09/02/2024 - 08:19

లార్డ్స్ వేదిక‌గా శ్రీల‌కంతో జ‌రిగిన రెండో టెస్టులో 190 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే ఇంగ్లండ్‌ కైవసం చేసుకుంది. 483 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 292 పరుగులకు ఆలౌటైంది.

లంక బ్యాటర్లలో కరుణ్‌రత్నే(55), చందీమాల్‌(58), దనుజంయ డి సిల్వా(50) హాఫ్‌ సెంచరీలతో పోరాడినప్పటికీ తమ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో గౌస్‌ అట్కిన్సన్‌ 5 వికెట్లతో చెలరేగగా.. క్రిస్‌ వోక్స్‌, స్టోన్‌ తలా రెండు వికెట్లు సాధించారు. 

అంత‌కుముందు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 251 ప‌రుగుల‌కే  ఆలౌటైంది. కానీ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జ‌ట్టుకు  231 ప‌రుగుల భారీ లీడ్ ల‌భించింది. ఈ ఆధిక్యాన్ని క‌లుపున‌కుని 483 ప‌రుగుల భారీ టార్గెట్‌ను లంకేయులు ముందు ఇంగ్లీష్ జ‌ట్టు ఉంచింది. 

ఈ కొండంత ల‌క్ష్యాన్ని చేధించ‌డంలో శ్రీలంక విఫ‌ల‌మైంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 427 ప‌రుగులు చేయ‌గా.. శ్రీలంక 196 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఇక ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల‌లోనూ ఇంగ్లండ్ స్టార్ బ్యాట‌ర్ జో రూట్ సెంచ‌రీల‌తో మెరిశాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో 143 ప‌రుగులు చేసిన జో.. రెండో ఇన్నింగ్స్‌లో 103 ర‌న్స్‌తో స‌త్తాచాటాడు. అదేవిధంగా ఇంగ్లీష్‌ పేస్ బౌల‌ర్ అట్కిన్స‌న్ కూడా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఎనిమిదో స్ధానంలో వ‌చ్చి సెంచ‌రీతో చెల‌రేగిన అట్కిన్స‌న్‌.. బౌలింగ్‌లోనూ అద‌ర‌గొట్టాడు. ఓవ‌రాల్‌గా 7 వికెట్లు ప‌డ‌గొట్టి ఇంగ్లండ్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)