Breaking News

చరిత్రాత్మక లార్డ్స్‌ టెస్ట్‌లో ఇంగ్లండ్‌దే గెలుపు

Published on Sun, 06/07/2026 - 17:45

లార్డ్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన చారిత్రక టెస్ట్‌ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో లార్డ్స్‌లో జరిగిన 150వ మ్యాచ్‌ కావడంతో చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంలో 150 టెస్ట్‌లకు ఆతిథ్యమిచ్చిన తొలి స్టేడియం లార్డ్స్‌ క్రికెట్‌ మైదానం​.

పేసర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యాయి. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ ఇంగ్లండ్‌ను 140 పరుగులకే ఆలౌట్‌ చేసింది. జేమీసన్‌ 5, నాథన్‌ స్మిత్‌ 3, విలియమ్‌ ఓరూర్కీ 2 వికెట్లతో సత్తా చాటారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్‌ (56) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.

అనంతరం న్యూజిలాండ్‌ మరింత చెత్తగా ఆడి 113 పరుగులకే కుప్పకూలింది. రాబిన్సన్‌ 5, టంగ్‌ 3, అట్కిన్సన్‌ 2 వికెట్లతో చెలరేగారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసిన జేమీసన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

27 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ అరంగేట్రం బ్యాటర్‌ ఎమిలియో గే (57), డకెట్‌ (33), జేమీ స్మిత్‌ (39) రాణించడంతో 226 పరుగులు చేయగలిగింది. నాథన్‌ స్మిత్‌ 6 వికెట్లతో విజృంభించగా.. విలియమ్‌ ఓరూర్కీ 2, మ్యాట్‌ హెన్రీ, జేమీసన్‌ తలో వికెట్‌ తీశారు.

254 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ మరోసారి బొక్కబోర్లా పడింది. అట్కిన్సన్‌ 5, రాబిన్సన్‌, టంగ్‌ తలో 2, స్టోక్స్‌ ఓ వికెట్‌ పడగొట్టడంతో 138 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో కాన్వే (41), గ్లెన్‌ ఫిలిప్స్‌ (44 నాటౌట్‌), కేన్‌ విలియమ్సన్‌ (18) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్‌ కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా జూన్‌ 17న మొదలవుతోంది. 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు