Breaking News

న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌.. 16 ఏళ్ల తర్వాత సిరీస్‌ కైవసం

Published on Sun, 12/08/2024 - 11:57

న్యూజిలాండ్‌ గడ్డపై ఇంగ్లండ్‌ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. వెల్లింగ్టన్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య కివీస్‌ను 323 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే 2-0 తేడాతో ఇంగ్లండ్‌ కైవసం చేసుకుంది.

కాగా న్యూజిలాండ్‌ గడ్డపై ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ సొంతం చేసుకోవడం 16 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. 583 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బ్లాక్‌ క్యాప్స్‌ 259 పరుగులకు ఆలౌటైంది.

న్యూజిలాండ్‌ బ్యాటర్లలో టామ్‌ బ్లండెల్‌(115) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బెన్‌ స్టోక్స్‌ 3 వికెట్లు పడగొట్టగా.. క్రిస్‌ వోక్స్‌, కార్సే తలా రెండు వికెట్లు సాధించారు.

హ్యారీ బ్రూక్ సూపర్‌ సెంచరీ.. 
అంతకుముందు ఇంగ్లండ్‌  సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో జో రూట్‌(106) సూపర్‌ సెంచరీతో చెలరేగాడు. అదే విధంగా బెన్‌ డకెట్‌(92), జాకెబ్‌ బెతల్‌(96) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు.
మ్యాచ్‌ స్కోర్లు..
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 280/10
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 125/10
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 424/6 డిక్లేర్‌
కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌: 259/10
ఫలితం: 323 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం
ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌: హ్యారీ బ్రూక్‌
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)