Breaking News

జేసన్‌ రాయ్‌ విధ్వంసం; సిరీస్‌ కైవసం చేసుకున్న ఇంగ్లండ్‌

Published on Fri, 03/03/2023 - 21:08

ఢాకా వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌(124 బంతుల్లో 132, 18 ఫోర్లు, ఒక సిక్సర్‌) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్‌ బట్లర్‌ 76 పరుగులతో రాణించాడు. చివర్లో మొయిన్‌ అలీ 42 నాటౌట్‌, సామ్‌ కరన్‌(19 బంతుల్లో 33 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు.

బంగ్లా బౌలర్లలో తస్కిన్‌ అహ్మద్‌ మూడు వికెట్లు తీయగా.. మెహదీ హసన్‌ రెండు, షకీబ్‌ , తైజుల్‌ ఇస్లామ్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 194 పరుగులకే కుప్పకూలింది. షకీబ్‌ అల్‌ హసన్‌ 58 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. తమీమ్‌ ఇక్బాల్‌ 35 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో సామ్‌ కరన్, ఆదిల్‌ రషీద్‌లు చెరో నాలుగు వికెట్లతో చెలరేగారు.

ఈ విజయం ఇంగ్లండ్‌ మరొక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య మూడో వన్డేమ్యాచ్‌ సోమవారం(మార్చి 6న) చట్టోగ్రామ్‌ వేదికగా జరగనుంది. సెంచరీతో​ చెలరేగిన జేసన్‌ రాయ్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)