యాషెస్‌ సిరీస్‌ విజేతగా ఇంగ్లండ్‌.. ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్‌ ఓటమి

Published on Sun, 07/09/2023 - 10:31

మహిళల యాషెస్‌ 2023లో భాగంగా జరిగిన టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో ఇంగ్లండ్‌ సొంతం చేసుకుంది. లార్డ్స్‌ వేదికగా జరిగిన సిరీస్‌ డిసైడర్‌ మూడో టీ20లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా బ్యాటర్లలో మూనీ(32), గార్డెనర్‌(32), పెర్రీ(34) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో నాట్‌ స్కివర్‌ రెండు,  డీన్‌, బెల్‌, గిబ్సన్‌, ఎకిలస్టన్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక ఇన్నింగ్స్‌ అనంతరం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఇంగ్లండ్‌ విజయలక్ష్యాన్ని 14 ఓవర్లకు 119 పరుగులగా కుదించారు.

అనంతరం 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్‌ జట్టు 13.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్‌ విజయంలో అలీస్‌ క్యాప్సీ(46) పరుగులతో కీలక పాత్ర పోషించింది. ఆసీస్‌ బౌలర్లలో మెగాన్‌ స్కాట్‌ రెండు వికెట్లు, బ్రౌన్‌, జానెసన్‌, జార్జీయా తలా వికెట్‌ సాధించారు.

కాగా అంతకుముందు  యాషెస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే విధంగా మహిళల యాషెస్‌ 2023లో భాగంగా మూడు వన్డేల సిరీస్‌లో కూడా ఇరు జట్లు తలపడనున్నాయి. జూలై 12 బ్రిస్టల్‌ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.
చదవండి: IND vs AFG: టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ఆ సిరీస్‌కు ముహూర్తం ఖరారు!

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)