Breaking News

పాకిస్తాన్‌ పర్యటనకు ఇంగ్లండ్‌.. సిరీస్‌ అక్కడే

Published on Fri, 09/20/2024 - 19:35

పాకిస్తాన్‌- ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ నిర్వహణపై పాక్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) స్పష్టతనిచ్చింది. తమ దేశంలోనే ఈ సిరీస్‌ జరుగుతుందని శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ముల్తాన్‌, రావల్పిండి ఇందుకు ఆతిథ్యం ఇస్తాయని పేర్కొంది. అక్టోబరు 7 నుంచి 28 వరకు ఇరుజట్ల మూడు టెస్టుల నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైనట్లు వెల్లడించింది.

కాగా చాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఐసీసీ టోర్నీ నిర్వహించేందుకు తమ స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా లేవని పీసీబీ చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీ స్వయంగా పేర్కొన్నాడు. అందుకే భారీ మొత్తంలో నిధులు కేటాయించి స్టేడియాల్లో మెరుగైన వసతులతో పాటు.. పలు పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు తెలిపాడు.

శ్రీలంక లేదంటే యూఏఈలో అంటూ వదంతులు
వచ్చే ఏడాది జరుగనున్న ఈ మెగా ఈవెంట్‌ నాటికి అంతా సిద్ధం చేస్తామని నక్వీ పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ పాకిస్తాన్‌ పర్యటనకు వచ్చే అంశంపై సందేహాలు నెలకొన్నాయి. స్టేడియాల ప్రక్షాళన నేపథ్యంలో పీసీబీ ఇంగ్లండ్‌తో సిరీస్‌ వేదికను మార్చే యోచనలో ఉందని.. శ్రీలంక లేదంటే యూఏఈలో నిర్వహిస్తారనే వార్తలు వినిపించాయి.

అయితే, అనుమానాలన్నింటి పటాపంచలు చేస్తూ పీసీబీ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. తమ దేశంలోనే పాకిస్తాన్‌ జట్టు ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు ఆడనున్నట్లు స్పష్టం చేసింది. అక్టోబరు 7-11, 15-19 మధ్య జరుగనున్న తొలి రెండు మ్యాచ్‌లకు ముల్తాన్‌.. అక్టోబరు 24-28 వరకు జరుగనున్న ఆఖరి టెస్టుకు రావల్పిండి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. 

నిజానికి కరాచీలో జరగాల్సిన ఈ చివరి టెస్టును అక్కడి నుంచి తరలించడానికి కారణం.. పునరుద్ధరణ కార్యక్రమాలే అని పేర్కొంది. అక్టోబరు 2న ఇంగ్లండ్‌ జట్టు ముల్తాన్‌కు చేరుకోనున్నట్లు వెల్లడించింది. కాగా పాకిస్తాన్‌ చివరగా బంగ్లాదేశ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌ ఆడింది.

ఘోర పరాభవం నుంచి కోలుకునేనా?
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌లో భాగమైన ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్‌ ఘోర పరాభవం మూటగట్టుకుంది. టెస్టు చరిత్రలో తొలిసారి బంగ్లా చేతిలో ఓడటమే గాకుండా.. 0-2తో వైట్‌వాష్‌కు గురైంది. ఫలితంగా మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో తదుపరి జరుగనున్న టెస్టు సిరీస్‌ షాన్‌ మసూద్‌ బృందానికి విషమ పరీక్షగా మారింది.
చదవండి: చరిత్ర సృష్టించిన జైస్వాల్‌.. గావస్కర్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)