Breaking News

యాషెస్‌ మూడో టెస్ట్‌ చాలా ప్రత్యేకం.. ఆ ఇద్దరూ లేకుండా 6037 రోజుల తర్వాత..!

Published on Thu, 07/06/2023 - 11:19

హెడింగ్లే వేదికగా ఇవాల్టి నుంచి (జులై 6) ప్రారంభంకానున్న యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్ట్‌ మ్యాచ్‌ పలు ప్రత్యేకతలను సంతరించుకుంది. ఈ మ్యాచ్‌ ఆసీస్‌ స్టార్‌ ప్లేయర్‌ స్టీవ్‌ స్మిత్‌కు వందో టెస్ట్‌ మ్యాచ్‌ కాగా.. ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌, ఆసీస్‌ స్టార్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయోన్‌ లేకుండా 6037 రోజుల తర్వాత ఓ యాషెస్‌ టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతుంది.

ఆండర్సన్‌, లయోన్‌ లేకుండా 2006 డిసెంబర్‌ 26న చివరిసారిగా ఓ యాషెస్‌ టెస్ట్‌ మ్యాచ్‌ జరిగింది. కాగా, రెండో టెస్ట్‌ సందర్భంగా గాయపడినందున నాథన్‌ లయోన్‌ సిరీస్‌ మొత్తానికే దూరం కాగా, తొలి రెండు టెస్ట్‌ల్లో రాణించికపోవడంతో ఆండర్సన్‌ను ఇంగ్లీష్‌ మేనేజ్‌మెంట్‌ పక్కన పెట్టింది (మూడో టెస్ట్‌కు). 

ఇదిలా ఉంటే, లార్డ్స్‌లో ముగిసిన రెండో టెస్ట్‌లో పర్యాటక ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 327 పరుగులకు ఆలౌటైంది.

ఫలితంగా ఆసీస్‌ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బెన్‌ స్టోక్స్‌ (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) వీరోచితంగా పోరాడినప్పటికీ ఇంగ్లండ్‌ను గెలిపించలేకపోయాడు. మ్యాచ్‌ ఆఖరి రోజు జానీ బెయిర్‌స్టో స్టంపౌట్‌ వివాదాస్పదమైంది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు