విండీస్‌ ప్లేయర్‌ భారీ సిక్సర్‌.. ప్రేక్షకులకు తప్పిన పెను ప్రమాదం

Published on Sun, 07/21/2024 - 16:31

ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మూడో రోజు ఆటలో విండీస్‌ ఆటగాడు షమార్‌ జోసఫ్‌ బాదిన ఓ భారీ సిక్సర్‌ దెబ్బకు స్టేడియం పైకప్పుపై టైల్స్‌ బద్దలయ్యాయి.

బద్దలైన టైల్స్‌ కింద కూర్చున్న ప్రేక్షకులపై పడబోగా వారు తప్పించుకున్నారు. ఒకవేళ ప్రేక్షకులు అప్రమత్తం కాకపోయి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. రూఫ్‌ కింద కూర్చున్న వారు తీవ్ర గాయాల పాలయ్యేవారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతుంది.

కాగా, 11వ నంబర్‌ ఆటగాడిగా బరిలోకి దిగిన షమార్‌ జోసఫ్‌ మూడో రోజు ఆటలో చెలరేగిపోయాడు. షమార్‌ 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. షమార్‌ మెరుపు ఇన్నింగ్స్‌ కారణంగా విండీస్‌కు 41 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ లభించింది.

అంతకుముందు కవెమ్‌ హాడ్జ్‌ (120) సెంచరీతో.. అలిక్‌ అథనాజ్‌ (82), జాషువ డసిల్వ (82 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించడంతో విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేసింది. 

దీనికి ముందు ఓలీ పోప్‌ (121) సెంచరీతో.. బెన్‌ డకెట్‌ (71), బెన్‌ స్టోక్స్‌ (69) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసి 207 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. హ్యారీ బ్రూక్‌ (71), జో రూట్‌ (37) క్రీజ్‌లో ఉన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)