ENG VS WI 2nd ODI: 54వ సెంచరీ.. చరిత్ర సృష్టించిన జో రూట్‌

Published on Sun, 06/01/2025 - 22:50

ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జో రూట్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 54వ సెంచరీ, వన్డేల్లో 18వ సెంచరీని నమోదు చేశాడు. వెస్టిండీస్‌తో ఇవాళ (జూన్‌ 1) జరుగుతున్న రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు. సెంచరీ చేసే క్రమంలో రూట్‌ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌ తరఫున వన్డేల్లో 7000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్‌ నిర్దేశించిన 309 పరుగుల లక్ష్య ఛేదనలో రూట్‌ అజేయమైన సెంచరీతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. రూట్‌ సిక్సర్‌, బౌండరీతో సెంచరీ పూర్తి చేశాడు. 

38 ఓవర్ల అనంతరం​ ఇంగ్లండ్‌ స్కోర్‌ 226/5గా ఉంది. రూట్‌తో (117) పాటు విల్‌ జాక్స్‌ (35) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలవాలంటే 72 బంతుల్లో 83 పరుగులు చేయాల్సి ఉంది. ఛేదనలో ఇంగ్లండ్‌ ఆదిలో ఎదురుదెబ్బలు తినింది. ఓపెనర్లు జేమీ స్మిత్‌, బెన్‌ డకెట్‌ ఇద్దరూ డకౌట్‌ అయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన రూట్‌ అజేయమైన సెంచరీతో విజయం దిశగా తీసుకెళ్తున్నాడు. హ్యారీ బ్రూక్‌ 47, జోస్‌ బట్లర్‌ 0, జేకబ్‌ బేతెల్‌ 17 పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో అల్జరీ జోసఫ్‌ 2, జేడన్‌ సీల్స్‌, మాథ్యూ ఫోర్డ్‌, రోస్టన్‌ ఛేజ్‌ తలో వికెట్‌ తీశారు.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌  47.4 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌటైంది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ కీసీ కార్టీ సూపర్‌ సెంచరీతో (105 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 103 పరుగులు), ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌ (67 బంతుల్లో 59; 10 ఫోర్లు), నాలుగో నంబర్‌ ఆటగాడు షాయ్‌ హోప్‌ (66 బంతుల్లో 78; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆదిల్‌ రషీద్‌ (10-0-63-4), సాకిబ్‌ మహమూద్‌ (9.4-0-37-3) చెలరేగగా.. బ్రైడన్‌ కార్స్‌, జేకబ్‌ బేతెల్‌, విల్‌ జాక్స్‌ తలో వికెట్‌ తీశారు.

కాగా, విండీస్‌ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. తొలి వన్డేలో ఇంగ్లండ్‌ 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు (ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లు)..
విరాట్‌ కోహ్లి-82
జో రూట్‌-54
రోహిత్‌ శర్మ-49
కేన్‌ విలియమ్సన్‌-48
స్టీవ్‌ స్మిత్‌-48

వన్డేల్లో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక పరుగులు..
జో రూట్‌-7000 (నాటౌట్‌)
ఇయాన్‌ మోర్గాన్‌-6957
ఇయాన్‌ బెల్‌-5416
జోస్‌ బట్లర్‌-5196
పాల్‌ కాలింగ్‌వుడ్‌-5092 
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)