Breaking News

ENG VS SL 3rd Test: రూట్‌ ఖాతాలో భారీ రికార్డు

Published on Sun, 09/08/2024 - 20:32

శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జో రూట్‌ ఓ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 11 పరుగుల వద్ద రూట్‌ టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా అవతరించాడు. గతంలో ఈ స్థానంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర ఉండేవాడు. సంగక్కర 134 టెస్ట్‌ల్లో 12400 పరుగులు చేయగా.. రూట్‌ తన 146వ టెస్ట్‌లో సంగక్కర రికార్డును బ్రేక్‌ చేశాడు. 

సంగక్కర రికార్డు బద్దలు కొట్టాక రూట్‌ మరో పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం రూట్‌ ఖాతాలో 12402 పరుగులు ఉన్నాయి. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో రూట్‌ 83 పరుగులు చేసుంటే టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా అవతరించేవాడు. ప్రస్తుతం ఆ స్థానంలో ఇంగ్లండ్‌కే చెందిన అలిస్టర్‌ కుక్‌ ఉన్నాడు. కుక్‌ ఖాతాలో 12472 టెస్ట్‌ పరుగులు ఉన్నాయి. 

ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అత్యధిక పరుగుల రికార్డు దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉంది. సచిన్‌ ఖతాలో 15921 పరుగులు ఉన్నాయి. సచిన్‌ తర్వాత రికీ పాంటింగ్‌ (13378), జాక్‌ కల్లిస్‌ (13289), రాహుల్‌ ద్రవిడ్‌ (13288) టాప్‌-4 టెస్ట్‌ రన్‌ స్కోరర్లుగా ఉన్నారు.

70 పరుగులకే 6 వికెట్లు..
మ్యాచ్‌ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలుతుంది. ఆ జట్టు 70 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు కేవలం 132 పరుగుల ఆధిక్యంలో ఉంది. బెన్‌ డకెట్‌ 7, డేనియల్‌ లారెన్స్‌ 35, ఓలీ పోప్‌ 7, జో రూట్‌ 12, హ్యారీ బ్రూక్‌ 3, క్రిస్‌ వోక్స్‌ 0 పరుగులకు ఔటయ్యారు. లంక బౌలర్లలో లహీరు కుమార 3, విశ్వ ఫెర్నాండో 2, అశిత ఫెర్నాండో ఓ వికెట్‌ తీసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు.

అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. 211/5 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో 52 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది.

దీనికి ముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్‌ (154) భారీ శతకంతో కదంతొక్కగా.. బెన్‌ డకెట్‌ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

కాగా, శ్రీలంక​ మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించింది. సిరీస్‌ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్‌ నామమాత్రంగా సాగుతుంది. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)