Breaking News

ఈ ఏడాది మూడో శతకం.. వన్డేల్లోనూ కొనసాగుతున్న రూట్‌ జోరు

Published on Mon, 09/08/2025 - 10:39

గత ఐదారేళ్లుగా టెస్ట్‌ క్రికెట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న జో రూట్‌.. ప్రస్తుతం వన్డేల్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. కొంతకాలం క్రితం వరకు రూట్‌కు కేవలం టెస్ట్‌ బ్యాటర్‌గా మాత్రమే ముద్ర ఉండేది. ఈ ముద్రను రూట్‌ ఇటీవలికాలంలో చెరిపేశాడు. వన్డేల్లోనూ వరుస పెట్టి సెంచరీలు చేస్తూ, పరుగుల వరద పారిస్తూ సత్తా చాటుతున్నాడు.

ఈ ఏడాది రూట్‌ ఇప్పటికే 3 వన్డే శతకాలు చేశాడు. తాజాగా సౌతాఫ్రికాపై చేసిన సెంచరీ అతని వన్డే కెరీర్‌లో 19వది. మొత్తం కెరీర్‌లో 58వది. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో కోహ్లి (82) తర్వాత అత్యధిక సెంచరీలు రూట్‌ పేరిటే ఉన్నాయి. సెంచరీల విషయంలో రూట్‌ తన సమకాలిక దిగ్గజాలైన రోహిత్‌ శర్మ (49), కేన్‌ విలియమ్సన్‌ (48), స్టీవ్‌ స్మిత్‌ను (48) దాటేసి మరింత దూరం వెళ్లిపోతున్నాడు.

తాజాగా సౌతాఫ్రికాపై చేసిన సెంచరీతో బాబర్ ఆజమ్, బ్రియాన్ లారా, మహేల జయవర్ధనే సరసన చేరాడు. వీరంతా వన్డేల్లో తలో 19 సెంచరీలు చేశారు. తాజా చేసిన సెంచరీ రూట్‌ ఇంగ్లండ్‌ గడ్డపై 10వది. ఈ సెంచరీతో అతను స్వదేశంలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా ట్రెస్కోథిక్‌ రికార్డును బద్దలు కొట్టాడు.

వన్డేల్లో ఇప్పటికే ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక సెంచరీలు (19), పరుగులు (7301) చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న రూట్‌.. ఈ ఏడాది ఈ ఫార్మాట్‌లోనూ కెరీర్‌ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది రూట్‌ 70కి పైగా సగటుతో పరుగులు చేశాడు. ఫ్యాబ్‌ ఫోర్‌లో రూట్‌.. కోహ్లి, విలియమ్సన్‌, స్టీవ్‌ స్మిత్‌లకు సవాల్‌ విసురుతూ దూసుకుపోతున్నాడు.

సౌతాఫ్రికాతో మ్యాచ్‌ విషయానికొస్తే.. రూట్‌తో పాటు యువ ఆటగాడు జేకబ్‌ బేతెల్‌ కూడా సెంచరీతో చెలరేగడం, ఆతర్వాత బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌ నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్‌ సౌతాఫ్రికాపై 342 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతి భారీ విజయం. ఈ మ్యాచ్‌లో గెలిచినా ఇంగ్లండ్‌ 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)