Breaking News

ENG Vs NZ 4th ODI: శతక్కొట్టిన డేవిడ్‌ మలాన్‌.. ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌

Published on Fri, 09/15/2023 - 22:07

లండన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌ చేసింది. ఆ జట్టు ఓపెనర్‌ డేవిడ్‌ మలాన్‌ (114 బంతుల్లో 127; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో మలాన్‌ ఒక్కడే రాణించగా.. మిగతా ఆటగాళ్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు.

బెయిర్‌స్టో 13, రూట్‌ 29, హ్యారీ బ్రూక్‌ 10, జోస్‌ బట్లర్‌ 36, లివింగ్‌స్టోన్‌ 28, మొయిన్‌ అలీ 3, సామ్‌ కర్రన్‌ 20, డేవిడ్‌ విల్లే 19, బ్రైడన్‌ కార్స్‌ 15 నాటౌట్‌, రీస్‌ టాప్లే 1 నాటౌట్‌ పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో రచిన్‌ రవీంద్ర 4 వికెట్లతో విజృంభించగా.. డారిల్‌ మిచెల్‌, మ్యాట్‌ హెన్రీ తలో 2 వికెట్లు, జేమీసన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. గత మ్యాచ్‌ భారీ శతకంతో విరుచుకుపడిన బెన్‌ స్టోక్స్‌, ఐదు వికెట్లతో చెలరేగిన ట్రెంట్‌ బౌల్ట్‌ ఈ మ్యాచ్‌లో లేరు.

అనంతరం 312 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 6 ఓవర్ల తర్వాత వికెట్‌ నష్టానికి 26 పరుగులు చేసింది. డెవాన్‌ కాన్వే 7 పరుగులు చేసి రనౌట్‌ కాగా.. విల్‌ యంగ్‌ (15), హెన్రీ నికోల్స్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, 4 మ్యాచ్‌ల ఈ సిరీస్లో తొలి వన్డేలో​ న్యూజిలాండ్‌, రెండు, మూడు వన్డేల్లో ఇంగ్లండ్‌ గెలుపొందాయి. ఈ మ్యాచ్‌ ఇంగ్లండ్‌ గెలిస్తే (3-1) సిరీస్‌ వారి వశమే అవుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలిస్తే 2-2తో సిరీస్‌ సమం అవుతుంది. ఇదే పర్యటనలో 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 2-2తో సమమైన విషయం తెలిసిందే.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)