Breaking News

ENG VS IND 5th Test: అరుదైన ఘనత సాధించిన సిరాజ్‌

Published on Mon, 08/04/2025 - 11:24

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ సిరీస్‌లో 1000 బంతులు వేసిన తొలి బౌలర్‌గా (ఇరు జట్ల తరఫున) అవతరించాడు. అలాగే 2002 జూన్‌ నుంచి ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ల్లో అత్యధిక బంతులు బౌల్‌ చేసిన భారత ఫాస్ట్‌ బౌలర్‌గానూ నిలిచాడు. 

ఓవల్‌ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌లో ఈ ఘనతలు సాధించాడు. ఈ సిరీస్‌లో సిరాజ్‌ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ కొనసాగుతున్నాడు. 5 మ్యాచ్‌ల్లో సిరాజ్‌ 20 వికెట్లు పడగొట్టాడు.

ఐదో టెస్ట్‌ విషయానికొస్తే.. రసవత్తరంగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో చివరి రోజు ఇంగ్లండ్‌ గెలవాలంటే 35 పరుగులు, భారత్‌ గెలుపుకు నాలుగు వికెట్లు కావాలి. నాలుగో రోజు వెలుతురులేమి కారణంగా ఆటను గంట ముందుగా నిలిపి వేశారు.

374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.  క్రాలే (14), డకెట్‌ (54), ఓలీ పోప్‌ (27), బ్రూక్‌ (111), జో రూట్‌ (105), జేకబ్‌ బేతెల్‌ (5) ఔట్‌ కాగా.. జేమీ స్మిత్‌ (2), జేమీ ఓవర్టన్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్‌ కృష్ణ 3, సిరాజ్‌ 2, ఆకాశ్‌దీప్‌ ఓ వికెట్‌ తీశారు.

అంతకుముందు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్‌ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్‌ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్‌ సుందర్‌ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోష్‌ టంగ్‌ 5 వికెట్లు తీశాడు.

దీనికి ముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్‌ క్రాలే (64), హ్యారీ బ్రూక్‌ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్‌ నాయర్‌ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అట్కిన్సన్‌ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ 1-2తో వెనుకపడి ఉంది.

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)