Breaking News

వాహ్‌ సిరాజ్‌ మియా​.. చిరకాలం గుర్తుండిపోయేలా చేశావు..!

Published on Mon, 08/04/2025 - 17:25

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లో టీమిండియా పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన సహా మొత్తం 9 వికెట్లు తీసిన సిరాజ్‌.. ఆట చివరి రోజు అద్బుతం చేశాడు. 

ఇంగ్లండ్‌ గెలుపుకు 35 పరుగులు అవసరమైన దశలో తనలోని అత్యుత్తమ టాలెంట్‌ను వెలికి తీసి ఇంగ్లండ్‌ గెలుపును అడ్డుకున్నాడు. చివరి రోజు ప్రారంభానికి ముందు ఇంగ్లండ్‌ చేతిలో 4 వికెట్లు ఉండగా.. సిరాజ్‌ మ్యాజిక్‌ స్పెల్‌తో మూడు వికెట్లు తీశాడు. మరో వికెట్‌ను ప్రసిద్ద్‌ కృష్ణ పడగొట్టాడు.

దీంతో ఇంగ్లండ్‌ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ గెలుపుతో భారత్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుంది. ఈ సిరీస్‌ మొత్తంలో సిరాజ్‌ విశేషంగా రాణించాడు. 5 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో అత్యధిక బంతులు వేసిన బౌలర్‌ కూడా సిరాజే.

374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ హ్యారీ బ్రూక్‌ (111), జో రూట్‌ (105) సెంచరీలతో చెలరేగడంతో ఓ దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే భారత పేసర్లు అనూహ్యంగా పుంజుకోవడంతో చివరి 7 వికెట్లు 66 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. సిరాజ్‌ చిరకాలం గర్తుండిపోయే స్పెల్‌ వేసి టీమిండియా అపూర్వ విజయాన్నిందించాడు. 

అంతకుముందు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్‌ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్‌ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్‌ సుందర్‌ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోష్‌ టంగ్‌ 5 వికెట్లు తీశాడు.

దీనికి ముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్‌ క్రాలే (64), హ్యారీ బ్రూక్‌ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్‌ నాయర్‌ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అట్కిన్సన్‌ 5 వికెట్లతో చెలరేగాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ 1,3 మ్యాచ్‌లు గెలువగా.. భారత్‌ 2, 5 మ్యాచ్‌ల్లో నెగ్గింది. నాలుగో టెస్ట్‌ డ్రాగా ముగిసింది.

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)