ENG VS IND 5th Test: అట్కిన్సన్‌ విజృంభణ.. కుప్పకూలిన టీమిండియా

Published on Fri, 08/01/2025 - 16:28

ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌లో టీమిండియా చెత్త ఆటతీరును ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 224 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్‌ పేసర్‌ గస్‌ అట్కిన్సన్‌ (21.4-8-33-5) ధాటికి భారత ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది. అట్కిన్సన్‌కు జోష్‌ టంగ్‌ (16-4-57-3), క్రిస్‌ వోక్స్‌ (14-1-46-1) సహకరించారు.

204/6 వద్ద రెండు రోజు ఆట ప్రారంభించిన భారత్‌.. సెషన్‌ ప్రారంభమైన గంటలోపే ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాటర్లు కరుణ్‌ నాయర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ పెద్దగా పరుగులేమీ జోడించకుండానే పెవిలియన్‌కు చేరారు. ఆతర్వాత వచ్చిన సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు.

ఇవాల్టి ఆటలో అట్కిన్సన్‌ వీర లెవెల్లో విజృంభించాడు. చివరి నాలుగు వికెట్లలో మూడు వికెట్లు (సుందర్‌, సిరాజ్‌, ప్రసిద్ద్‌) అతనే తీశాడు. చాలాకాలం తర్వాత అర్దసెంచరీతో రాణించిన కరుణ్‌ను టంగ్‌ బోల్తా కొట్టించాడు.

భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 2, కేఎల్‌ రాహుల్‌ 14, సాయి సుదర్శన్‌ 38, శుభ్‌మన్‌ గిల్‌ 21, కరుణ్‌ నాయర్‌ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్‌ జురెల్‌ 19, వాషింగ్టన్‌ సుందర్‌ 26, సిరాజ్‌, ప్రసిద్ద్‌ డకౌట్‌ అయ్యారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)