Breaking News

ENG VS IND 3rd Test: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో రిషబ్‌ పంత్‌

Published on Wed, 07/09/2025 - 13:16

టీమిండియా డాషింగ్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. రేపటి నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లో మరో 5 సిక్సర్లు బాదితే టెస్ట్‌ల్లో భారత్‌ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్‌ పేరిట ఉంది. వీరూ 103 టెస్ట్‌ల్లో 90 సిక్సర్లు బాదాడు. వీరూ తర్వాతి స్థానంలో రోహిత్‌ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్‌ 67 టెస్ట్‌ల్లో 88 సిక్సర్లు కొట్టాడు. 

పంత్‌ విషయానికొస్తే.. ఇతగాడు కేవలం 45 మ్యాచ్‌ల్లోనే 86 సిక్సర్లు బాది చరిత్ర సృష్టించేందుకు మరో 5 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. పంత్‌ ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే రేపటి నుంచి ప్రారంభమయ్యే టెస్ట్‌లో ఈ రికార్డు సాధించడం ఖాయంగా కనినిస్తుంది.

ఓవరాల్‌గా చూస్తే టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో పంత్‌ 12వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌లో పంత్‌ 5 సిక్సర్లు కొడితే భారత్‌ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డుతో పాటు టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఏడో స్థానానికి ఎగబాకుతాడు. 

టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ పేరిట ఉంది. స్టోక్స్‌ 113 మ్యాచ్‌ల్లో 133 సిక్సర్లు బాదాడు. స్టోక్స్‌ తర్వాతి స్థానాల్లో బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (107), గిల్‌క్రిస్ట్‌ (100), టిమ్‌ సౌథీ (98), గేల్‌ (98), కల్లిస్‌ (97), సెహ్వాగ్‌ (91), ఏంజెలో మాథ్యూస్‌ (90), రోహిత్‌ శర్మ (88), లారా (88) ఉన్నారు (టాప్‌-10లో).

కొద్ది రోజుల కిందట మరో భారీ సిక్సర్ల రికార్డు బద్దలు 
కొద్ది రోజుల కిందట జరిగిన ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్‌లో పంత్‌ మరో భారీ సిక్సర్ల రికార్డు సాధించాడు. విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో బెన్‌ స్టోక్స్‌ పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును బద్దలు కొట్టాడు.  పంత్‌ ఇంగ్లండ్‌లో (టెస్ట్‌ల్లో) 23 సిక్సర్లు బాదగా.. స్టోక్స్‌ సౌతాఫ్రికాలో 21 సిక్సర్లు కొట్టాడు. 

భీకర ఫామ్‌లో పంత్‌
ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న  విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో పంత్‌ రెండు ఇన్నింగ్స్‌లో శతకాలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 178 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 140 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు.

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో పంత్‌ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే (25) ఔటైనా, రెండో ఇన్నింగ్స్‌లో తనదైన శైలిలో మెరుపు అర్ద సెంచరీ (65) చేశాడు. 

రేపటి నుంచి లార్డ్స్‌ వేదికగా ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. పంత్‌ మరోసారి చెలరేగాలని అంతా ఆశిస్తున్నారు. ఈ సిరీస్‌లో భారత్‌, ఇంగ్లండ్‌ తలో మ్యాచ్‌ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ గెలవగా.. రెండో టెస్ట్‌లో భారత్‌ భారీ విజయం సాధించింది. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)