Breaking News

ENG VS IND 2nd Test: నిప్పులు చెరిగిన ఆకాశ్‌దీప్‌, సిరాజ్‌.. పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్‌

Published on Thu, 07/03/2025 - 22:21

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ రికార్డు డబుల్‌ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్‌కు భారీ స్కోర్‌ అందించాడు. 

భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్‌ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్‌ సుందర్‌ (42) రాణించారు. గిల్‌.. జడేజాతో ఆరో వికెట్‌కు 203 పరుగులు , వాషింగ్టన్‌ సుందర్‌తో (42) ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు.

మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌ 2, కరుణ్‌ నాయర్‌ 31, రిషబ్‌ పంత్‌ 25, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 1, ఆకాశ్‌దీప్‌ 6, సిరాజ్‌ 8, ప్రసిద్ద్‌ కృష్ణ 5 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌ 3, క్రిస్‌ వోక్స్‌, జోష్‌ టంగ్‌ తలో 2, బ్రైడన్‌ కార్స్‌, బెన్‌ స్టోక్స్‌, జో రూట్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

వరుస షాక్‌లు
అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్‌ ఆడుతున్న ఆకాశ్‌దీప్‌ నిప్పులు చెరిగాడు. వరుస బంతుల్లో తొలి టెస్ట్‌లో సెంచరీలు చేసిన బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌లను డకౌట్‌ చేశాడు. దీంతో ఇంగ్లండ్‌ 13 పరుగలకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

మరో ఎదురుదెబ్బ
13 పరుగుల వద్ద వరుస బంతుల్లో ఇన్‌ ఫామ్‌ బ్యాటర్లు డకెట్‌, పోప్‌ వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 25 పరుగుల వద్ద జాక్‌ క్రాలే (19) ఔటయ్యాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో కరుణ్‌ నాయర్‌ క్యాచ్‌ పట్టడంతో క్రాలే పెవిలియన్‌కు చేరాడు. 10 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 33/3గా ఉంది. రూట్‌ (5), బ్రూక్‌ (5) క్రీజ్‌లో ఉన్నారు.

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)