Breaking News

ఎట్టకేలకు ఒక విజయం

Published on Tue, 07/14/2026 - 23:30

బర్మింగ్‌హామ్‌: ఫార్మాట్‌ మారింది... ఫలితం మారింది... ఐర్లాండ్‌–ఇంగ్లండ్‌ పర్యటనలో ఒక్క గెలుపు కోసం ఎదురు చూస్తున్న భారత అభిమానులకు ఎట్టకేలకు ఊరట దక్కింది. టి20ల్లో ఆరు పరాజయాల తర్వాత వన్డేల్లో సరైన ఆరంభం లభించింది. ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ 47.5 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది. జో రూట్‌ (76 బంతుల్లో 76 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌), లియామ్‌ డాసన్‌ (83 బంతుల్లో 68; 6 ఫోర్లు 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేశారు. 

ఇంగ్లండ్‌ 107/6తో ఇబ్బందుల్లో ఉన్న దశలో రూట్, డాసన్‌ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 22.2 ఓవర్లలో 121 పరుగులు జోడించారు. అనంతరం భారత్‌ 45.2 ఓవర్లలో 4 వికెట్లకు 262 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (75 బంతుల్లో 80 రిటైర్ట్‌హర్ట్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌), అక్షర్‌ పటేల్‌ (52 బంతుల్లో 57 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌), వాషింగ్టన్‌ సుందర్‌ (63 బంతుల్లో 52 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేశారు. అక్షర్, సుందర్‌ ఐదో వికెట్‌కు 105 బంతుల్లో అభేద్యంగా 102 పరుగులు జత చేశారు. సిరీస్‌లో భారత్‌ 1–0తో పైచేయి సాధించగా... కార్డిఫ్‌లో రేపు రెండో వన్డే జరుగుతుంది.  

కీలక భాగస్వామ్యం... 
భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంలో ఆరంభంలో స్కోరు చేయడానికి ఇంగ్లండ్‌ బాగా ఇబ్బంది పడింది. 13వ బంతికి గానీ బెతెల్‌ (14) తొలి పరుగు తీయలేకపోగా, 7 ఓవర్లలో జట్టు 20 పరుగులే చేసింది. బుమ్రా తన తొలి స్పెల్‌ను 4–0–8–0తో ముగించాడు. ఈ దశలో గుర్నూర్‌ తొలి ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్‌ బాది దూకుడు ప్రదర్శించిన బెన్‌ డకెట్‌ (45 బంతుల్లో 43; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అతని రెండో ఓవర్లో మరో 2 ఫోర్లు కొట్టాడు. అయితే గుర్నూర్‌ తన తర్వాతి ఓవర్లో ప్రతీకారం తీర్చుకున్నాడు. 

ఒకే ఓవర్లో అతను బెతెల్, డకెట్‌లను వెనక్కి పంపించాడు. బుమ్రా చక్కటి బంతితో బ్రూక్‌ (1) పని పట్టగా... ఒకే ఓవర్లో బట్లర్‌ (5), స్యామ్‌ కరన్‌ (0)లను ప్రసిధ్‌ అవుట్‌ చేశాడు. 27 బంతుల వ్యవధిలో 19 పరుగులు మాత్రమే చేసి ఇంగ్లండ్‌ 5 వికెట్లు చేజార్చుకుంది. ఆపై విల్‌ జాక్స్‌ (20) కొద్దిసేపు వికెట్ల పతనాన్ని నిలువరించాడు. అతనూ పెవిలియన్‌ చేరిన తర్వాత రూట్, డాసన్‌ భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది.

7 పరుగుల వద్ద రూట్‌ ఇచ్చిన సులువైన రిటర్న్‌ క్యాచ్‌ను దూబే వదిలేయడం ఇంగ్లండ్‌కు కాస్త కలిసొచ్చింది! ఈ క్రమంలో డాసన్‌ 65 బంతుల్లో వన్డేల్లో తన తొలి అర్ధసెంచరీ సాధించగా, రూట్‌ 57 బంతుల్లో కెరీర్‌లో 46వ హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. శతక భాగస్వామ్యం తర్వాత డాసన్‌ను అవుట్‌ చేసి అక్షర్‌ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత మరో 30 పరుగులకు ఇంగ్లండ్‌ చివరి 3 వికెట్లు కోల్పోగా, రూట్‌ అజేయంగా నిలిచాడు.  

రోహిత్, కోహ్లి విఫలం... 
ఛేదనలో భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. తడబడుతూనే ఆడిన రోహిత్‌ శర్మ (21 బంతుల్లో 11; 1 ఫోర్‌) భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరగ్గా, ఆర్చర్‌ చక్కటి బంతితో కోహ్లి (5)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కెపె్టన్‌ గిల్‌కు మరో ఎండ్‌ నుంచి శ్రేయస్‌ అయ్యర్‌ (35; 2 ఫోర్లు) సహకరించాడు. వీరిద్దరు 101 పరుగులు జత చేశారు. ఈ దశలో తొడ కండరాలు పట్టేయడంతో గిల్‌ మైదానం వీడగా... మూడు పరుగుల వ్యవధిలో అయ్యర్, రాహుల్‌ (1) వెనుదిరిగాడు. ఈ దశలో భారత్‌పై కొంత ఒత్తిడి కనిపించింది. 

అయితే సుందర్, అక్షర్‌ చక్కటి ప్రదర్శనతో జట్టును గెలుపు దిశగా నడిపించారు. 39 బంతుల్లోనే అక్షర్‌ నాలుగో అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గెలుపు ఖాయం చేశారు. రషీద్‌ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో సుందర్‌ 63 బంతుల్లో తన రెండో హాఫ్‌ సెంచరీని చేరుకోవడంతో పాటు మ్యాచ్‌ను ముగించాడు.

స్కోరు వివరాలు
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: డకెట్‌ (సి) బుమ్రా (బి) బ్రార్‌ 43; బెతెల్‌ (సి) సుందర్‌ (బి) బ్రార్‌ 14; రూట్‌ (నాటౌట్‌) 76; బ్రూక్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 1; బట్లర్‌ (సి) బ్రార్‌ (బి) ప్రసిధ్‌ 5; కరన్‌ (సి) రాహుల్‌ (బి) ప్రసిధ్‌ 0; జాక్స్‌ (సి) రాహుల్‌ (బి) దూబే 20; డాసన్‌ (సి) రోహిత్‌ (బి) అక్షర్‌ 68; ఆర్చర్‌ (సి) సుందర్‌ (బి) అక్షర్‌ 12; రషీద్‌ (స్టంప్డ్‌) రాహుల్‌ (బి) అక్షర్‌ 1; టంగ్‌ (బి) అక్షర్‌ 0; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (47.5 ఓవర్లలో ఆలౌట్‌) 258. వికెట్ల పతనం: 1–61, 2–63, 3–64, 4–80, 5–80, 6–107, 7–228, 8–250, 9–258, 10–258. బౌలింగ్‌: బుమ్రా 9–0–31–1, ప్రసిధ్‌ 10–2–50–2, గుర్నూర్‌ బ్రార్‌ 9–0–61–2, శివమ్‌ దూబే 6–0–27–1, సుందర్‌ 4–0–13–0, అక్షర్‌ పటేల్‌ 9.5–0–62–4.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) బ్రూక్‌ (బి) కరన్‌ 11; గిల్‌ (రిటైర్డ్‌హర్ట్‌) 80; కోహ్లి (ఎల్బీ) (బి) ఆర్చర్‌ 5; అయ్యర్‌ (రనౌట్‌) 35; సుందర్‌ (నాటౌట్‌) 52; రాహుల్‌ (బి) టంగ్‌ 1; అక్షర్‌ (నాటౌట్‌) 57; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (45.2 ఓవర్లలో 4 వికెట్లకు) 262. వికెట్ల పతనం: 1–43, 2–48, 3–157, 4–160.బౌలింగ్‌: ఆర్చర్‌ 10–0–60–1, టంగ్‌ 10–0–50–1, స్యామ్‌ కరన్‌ 10–0–55–1, రషీద్‌ 5.2–0–34–0, బెతెల్‌ 1–0–10–0, డాసన్‌ 2–0–10–0, జాక్స్‌ 7–0–43–0. 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)