Breaking News

పాకిస్తాన్‌ తొలి విజయం

Published on Mon, 10/21/2024 - 18:14

ఏసీసీ మెన్స్‌ టీ20 ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఏసియా కప్‌ 2024 టోర్నీలో పాకిస్తాన్‌-ఏ జట్టు తొలి విజయం నమోదు చేసింది. అల్‌ అమీరట్‌ వేదికగా ఒమన్‌తో ఇవాళ (అక్టోబర్‌ 21) జరిగిన మ్యాచ్‌లో పాక్‌-ఏ జట్టు 74 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. 

ఖాసిమ్‌ అక్రమ్‌ (48), రొహైల్‌ నజీర్‌ (41 నాటౌట్‌), ఆరాఫత్‌ మిన్హాస్‌ (31 నాటౌట్‌), ఒమైర్‌ యూసఫ్‌ (25), అబ్దుల్‌ సమద్‌ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఒమన్‌ బౌలరల్లో ముజాహిర్‌ రజా రెండు వికెట్లు పడగొట్టగా.. వసీం అలీ, సమయ్‌ శ్రీవత్సవ, సుఫ్యాన్‌ మెహమూద్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 186 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్‌.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 111 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. పాక్‌ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి ఒమన్‌ను కట్టడి చేశారు. జమాన్‌ ఖాన్‌ 2, షానవాజ్‌ దహాని, మొహమ్మద్‌ ఇమ్రాన్‌, ఖాసిమ్‌ అక్రమ్‌, అరాఫత్‌ మిన్హాస్‌, సుఫియాన్‌ ముఖీమ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

ఒమన్‌ బ్యాటర్లలో వసీం అలీ (28), జతిందర్‌ సింగ్‌ (24), హమ్మద్‌ మిర్జా (14), ఆమిర్‌ ఖలీమ్‌ (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. పాక్‌ ఈ టోర్నీలో తమ తదుపరి మ్యాచ్‌లో యూఏఈతో తలపడనుండగా.. భారత్‌ ఇవాళ సాయంత్రం అదే యూఏఈని ఢీకొట్టనుంది. 

చదవండి: పాక్ బౌలర్ ఓవరాక్షన్‌.. ఇచ్చిపడేసిన అభిషేక్ శర్మ
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)