Breaking News

పాక్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు! రియాన్‌ పరాగ్‌ సైతం

Published on Wed, 07/19/2023 - 18:11

ACC Mens Emerging Teams Asia Cup 2023- Pakistan A vs India A: ఏసీసీ మెన్స్‌ ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌-2023లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత-ఏ జట్టు బౌలర్లు అద్భుతంగా రాణించారు. యువ పేసర్‌ రాజ్‌వర్ధన్‌ హంగర్గేకర్‌ ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. 

వీరిద్దరికి తోడు మరో స్పిన్నర్‌ నిషాంత్‌ సింధు, పార్ట్‌టైమ్‌ స్పిన్‌ బౌలర్‌ రియాన్‌ పరాగ్‌ ఒక్కో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్‌-ఏ, పాక్‌- ఏ జట్ల మధ్య బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత  బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఓపెనర్‌ డకౌట్‌
ఈ క్రమంలో హంగర్గేకర్‌ పాక్‌ ఓపెనర్‌ సయీమ్‌ ఆయుబ్‌ను డకౌట్‌ చేయడంతో పాటు వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఒమైర్‌ యూసఫ్‌ను కూడా పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన పాక్‌ను ఓపెనర్‌ షాహిజాదా ఫర్హాన్‌(35), హసీబుల్లా ఖాన్‌(27) ఆదుకునే ప్రయత్నం చేశారు.

48 ఓవర్లలోనే కథ ముగిసింది
అయితే, మానవ్‌ సుతార్‌, హంగేర్గకర్‌ ధాటికి వరుసగా వికెట్లు పడ్డాయి. టాపార్డర్‌ విఫలమైన వేళ లోయర్‌ ఆర్డర్‌లో వచ్చిన కాసిం అక్రమ్‌(48), ముబాసిర్‌ ఖాన్‌(28) ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆఖర్లో మెహ్రాన్‌ మంతాజ్‌ 25 పరుగులతో అజేయంగా నిలిచాడు.

అయితే, భారత బౌలర్ల ధాటికి 48 ఓవర్లలోనే పాకిస్తాన్‌ కథ ముగిసింది. 205 పరుగులు చేసి దాయది జట్టు ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యశ్‌ ధుల్‌ సేన గెలవాలనే పట్టుదలతో రంగంలోకి దూకింది. కాగా ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో భారత్‌ విజయం సాధించింది. యూఏఈ, నేపాల్‌లపై వరుసగా 8, 9 వికెట్ల తేడాతో గెలుపొంది. చిరకాల ప్రత్యర్థిపై కూడా గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని భావిస్తోంది.

చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్‌లో ఎందుకు లేడు? అయినా అతడితో..
విండీస్‌తో రెండో టెస్టు! కీలక అప్‌డేట్‌ ఇచ్చిన రోహిత్‌!; వాళ్లకు నో ఛాన్స్‌!

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)