చరిత్ర సృష్టించిన ఆసీస్‌ ప్లేయర్‌

Published on Mon, 07/06/2026 - 12:06

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌ దిగ్గజం ఎల్లిస్‌ పెర్రీ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో (పురుషులు, మహిళలు) తొమ్మిది ఐసీసీ టైటిళ్లు (7 టీ20 ప్రపంచకప్‌లు, 2 వన్డే ప్రపంచకప్‌లు)  సాధించిన తొలి ప్లేయర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పింది . టీ20 ప్రపంచకప్‌ 2026 గెలుపుతో ఈ ఘనత సాధించింది.

పెర్రీ తర్వాత అత్యధిక ఐసీసీ టైటిళ్లు సాధించిన ప్లేయర్ల జాబితాలో రెండు, మూడు స్థానాల్లో కూడా ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లే ఉన్నారు. మాజీ వికెట్‌కీపర్ బ్యాటర్ అలిస్సా హీలీ (7 టీ20 ప్రపంచకప్‌లు, ఓ వన్డే ‍ప్రపంచకప్‌), మాజీ కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (5 టీ20 వరల్డ్‌కప్‌లు, ఓ వన్డే వరల్డ్‌కప్‌, 2 మహిళల ఛాంపియన్‌షిప్‌లు) తలో ఎనిమిది ఐసీసీ టైటిళ్లు సాధించారు.

ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నది కూడా ఆస్ట్రేలియనే. అయితే అతను పురుష క్రికెటర్‌. ఆసీస్‌ పురుషుల జట్టు మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ తన కెరీర్‌లో 3 ఐసీసీ టైటిళ్లు (2 వన్డే వరల్డ్‌కప్‌లు, ఛాంపియన్స్‌ ట్రోఫీ) సాధించాడు.

ఈ జాబితాలో భారత పురుష దిగ్గజ ప్లేయర్లు విరాట్‌ కోహ్లి (వన్డే ప్రపంచకప్, ఒక టీ20 ప్రపంచకప్, రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు), రోహిత్‌ శర్మ (టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, రెండు వన్డే ప్రపంచకప్‌లు) తలో 4 ఐసీసీ టైటిళ్లతో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు.

ఆతర్వాతి స్థానంలో భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోని ( 3 టైటిళ్లు.. టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ) ఉన్నాడు.

కాగా, తాజా టీ20 ప్రపంచకప్‌ గెలుపుతో ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో తమ ఏకఛత్రాధిపత్యాన్ని నిరాటంకంగా కొనసాగించింది. ఈ జట్టు ఏడో టీ20 ప్రపంచకప్‌ గెలుచుకోవడంతో తమ వరల్డ్‌కప్‌ల సంఖ్య 14కు చేర్చుకుంది. వన్డేల్లో కూడా ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్లుగా ఉన్న ఆసీస్‌ మహిళలు.. రెండు ఫార్మాట్లలో కలిపి ఎవరూ సాధించినన్ని టైటిళ్లు సాధించారు. 

పురుషుల క్రికెట్‌లోనూ ఆస్ట్రేలియాది ఇంచుమించు ఇలాంటి హవానే కొనసాగుతోంది. ఆ జట్టు ఇప్పటివరకు 6 వన్డే ప్రపంచకప్‌లు, ఓ టీ20 ప్రపంచకప్‌ సహా పలు ఐసీసీ టైటిళ్లు (2 ఛాంపియన్స్‌ ట్రోఫీలు, ఓ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌) సాధించింది. ఆస్ట్రేలియా మహిళల జట్టు కామన్‌వెల్త్‌ క్రీడల్లో కూడా బంగారు పతకం​ సాధించింది. ఈ లెక్కన పురుషుల విభాగామైనా, మహిళల విభాగమైనా క్రికెట్‌పై ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)