వరుసగా 8 సిక్సర్లు.. క్రికెట్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ

Published on Sun, 11/09/2025 - 17:13

క్రికెట్‌ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డు నమోదైంది. రంజీ ట్రోఫీ 2025-26లో మేఘాలయ ఆటగాడు ఆకాశ్‌ చౌదరి (Akash Choudhary) వరుసగా 8 బంతుల్లో సిక్సర్లు బాదాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో ఓ ఆటగాడు వరుసగా 8 సిక్సర్లు బాదడం ఇదే మొదటిసారి. గతంలో క్రికెట్‌ దిగ్గజాలు రవిశాస్త్రి, గ్యారీ సోబర్స్‌ వరుసగా 6 సిక్సర్లు మాత్రమే బాదగలిగారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (తొలి ఇన్నింగ్స్‌) ఆకాశ్‌ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆకాశ్‌ తొలి బంతిని వృధా చేశాడు. ఆతర్వాతి బంతికి సింగిల్‌ తీశాడు. ఆతర్వాత వరుసగా 8 బంతుల్లో 8 సిక్సర్లు బాదాడు. మొత్తంలో 11 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి, ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ (Fastest Half Century) రికార్డును కూడా నమోదు చేశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన మేఘాలయ 6 వికెట్ల నష్టానికి 628 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అర్పిత్‌ భటేవారా (207) డబుల్‌ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్‌ కిషన్‌ లింగ్డో (119), దలాల్‌ (144) సెంచరీలతో కదంతొక్కారు. ఆఖర్లో ఆకాశ్‌ చౌదరీ మెరుపు వేగంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి అజేయంగా నిలిచాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌ 73 పరుగులకే కుప్పకూలింది. ఆర్యన్‌ బోరా 4 వికెట్లు తీసి ఏపీ పతనాన్ని శాసించాడు. అరుణాచల్‌ ఇన్నింగ్స్‌లో నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ప్రస్తుతం రెండో రోజు చివరి సెషన్‌ ఆట కొనసాగుతుంది. మేఘాలయ 555 పరుగుల లీడ్‌ను సాధించింది.

చదవండి: టీమిండియాకు మరో షాక్‌

 

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)