Breaking News

టీ20 క్రికెట్‌లో సంచలనం.. కేవలం 16 పరుగలకే ఆలౌట్‌

Published on Sun, 03/10/2024 - 11:13

జింబాబ్వే దేశవాళీ టీ20 టోర్నీ-2024లో సంచలనం నమోదైంది. శనివారం డర్హామ్‌ జట్టుతో జరిగిన ఫైనల్‌ పోరులో ఈగల్స్‌ కేవలం 16 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీ20 చరిత్రలో అత్యల్ప స్కోర్‌ నమోదు చేసిన రెండో జట్టుగా ఈగల్స్‌ చెత్త రికార్డును నెలకొల్పింది. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో బిగ్‌బాష్‌ లీగ్‌ ఫ్రాంచైజీ సిడ్నీ థండర్స్‌ అ‍గ్రస్ధానంలో ఉంది. బిగ్‌బాష్‌ లీగ్‌-2022లో సిడ్నీ థండర్స్‌ కేవలం 15 పరుగులకే ఆలౌటైంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన డర్హామ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్‌ సాధిచింది. డర్హామ్‌ బ్యాటర్లలో బాస్‌ డి లీడ్‌(58) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మస్టర్డ్‌(46), రాబిన్సన్‌(49) పరుగులతో అదరగొట్టారు. అనంతరం 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఈగల్స్‌ కేవలం 16 పరుగులకే కుప్పకూలింది.

డర్హామ్‌ బౌలర్లలో కాఫ్‌లీన్‌,  పార్కిన్సన్‌, లూక్‌ రాబిన్సన్‌ తలా రెండు వికెట్లతో డర్హామ్‌ పతనాన్ని శాసించగా.. బాస్‌ డీ లీడ్‌, సౌటర్‌ తలా వికెట్‌ సాధించారు. మిగితా రెండు వికెట్లు రనౌట్‌ రూపంలో దక్కాయి. ఈగల్స్‌ బ్యాటర్లలో చిబావా(4) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: IPL 2024: 'చెన్నై, ముంబై, సన్‌రైజర్స్‌ కాదు.. ఈ సారి ఐపీఎల్‌ టైటిల్‌ ఆ జట్టుదే'

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)