Breaking News

వావ్‌.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే సూప‌ర్ క్యాచ్‌! వీడియో వైర‌ల్‌

Published on Tue, 04/29/2025 - 23:02

ఐపీఎల్‌-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప్లేయ‌ర్ దుష్మంత చమీర అద్బుత‌మైన ఫీల్డింగ్ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. చ‌మీరా సంచ‌ల‌న క్యాచ్‌తో అనుకుల్ రాయ్‌ను పెవిలియ‌న్‌కు పంపాడు.

చ‌మీరా క్యాచ్ అంతా షాక్ అయిపోయారు. కేకేఆర్ ఇన్నింగ్స్ ఆఖ‌రి ఓవ‌ర్ వేసిన స్టార్క్ బౌలింగ్‌లో మూడో బంతికి రావ్‌మ‌న్ పావెల్ వికెట్లు ముందు దొరికిపోయాడు. ఈ క్ర‌మంలో క్రీజులోకి వ‌చ్చిన అనుకుల్ రాయ్‌కు స్టార్క్ నాలుగో బంతిని మిడిల్ అండ్ లెగ్ దిశ‌గా సంధించాడు.

ఆ డెలివ‌రీని అనుకుల్ రాయ్ డీప్ స్వ్కెర్ లెగ్ దిశ‌గా ఫ్లిక్ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. షాట్ స‌రిగ్గా క‌న‌క్ట్ కావ‌డంతో అంతా బౌండ‌రీ వెళ్తుంద‌ని భావించారు. కానీ స్వ్కెర్ లెగ్‌లో ఉన్న చ‌మీరా అద్బుత విన్యాసం చేశాడు. స్వ్కెర్ లెగ్ నుంచి ప‌రిగెత్తుకుంటూ గాల్లోకి జంప్ చేస్తూ స్ట‌న్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. 

దీంతో స్టేడియంలో ఉన్న ప్రేక్ష‌కులు మొత్తం ఒక్క‌సారిగా బిత్త‌ర‌పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్యుత్త‌మ క్యాచ్‌ల‌లో ఒక‌టిగా నెటిజ‌న్లు కొనియాడుతున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(44) టాప్‌​ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్‌(36), గుర్భాజ్‌(26), నరైన్‌(27), రహానే(26) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్,విప్రజ్ నిగమ్ తలా రెండు వికెట్లు సాధించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)