Breaking News

5 వికెట్లతో చెలరేగిన వైశాక్‌..! పుజారా జట్టుకు ఓటమి తప్పదా?!

Published on Sat, 07/08/2023 - 07:37

Duleep Trophy 2023- South Zone vs North Zone, 2nd Semi-Final- బెంగళూరు: సౌత్‌జోన్‌ సీమర్‌ వైశాక్‌ విజయ్‌కుమార్‌ (5/76) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో నార్త్‌జోన్‌ను కూల్చేశాడు. దీంతో దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్లో నార్త్‌జోన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 56.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది.

ఓవర్‌నైట్‌ స్కోరు 51/2తో శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన నార్త్‌ జట్టు 160 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌ (63; 11 ఫోర్లు), హర్షిత్‌ రాణా (38; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

మూడు పరుగుల స్వల్ప ఆధిక్యంతో కలిపి నార్త్‌ జట్టు సౌత్‌ జట్టుకు 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా... ఆట ముగిసే సమయానికి సౌత్‌జోన్‌ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. ఆఖరి రోజు విజయానికి 194 పరుగుల దూరంలో ఉంది. 

పుజారా శతకం 
సెంట్రల్‌ జోన్‌తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో చతేశ్వర్‌ పుజారా (133; 14 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో కదంతొక్కగా, సూర్యకుమార్‌ యాదవ్‌ (52; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ సాధించాడు. దీంతో వెస్ట్‌ భారీ లక్ష్యంవైపు దూసుకెళుతోంది.

ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 292 పరుగులు చేసింది. సౌరభ్‌ 4, సారాంశ్‌ 3 వికెట్లు తీశారు. ప్రస్తుతం వెస్ట్‌ 384 పరుగుల ఆధిక్యంలో ఉంది. వర్షం కారణంగా చివరి రోజు ఆట సాధ్యంకాకుండా మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిస్తే తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో వెస్ట్‌ జోన్‌ జట్టుకు ఫైనల్‌ బెర్త్‌ ఖరారవుతుంది.

చదవండి:  బజ్‌బాల్‌ ఆట చూపించాడు.. అరుదైన రికార్డు కొల్లగొట్టాడు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)