Breaking News

ఆ జ‌ట్టు కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్‌

Published on Thu, 08/07/2025 - 17:32

టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఆడేందుకు గిల్ సిద్దమయ్యాడు. స్వదేశంలో వెస్టిండీస్‌, సౌతాఫ్రికాలతో టెస్టు సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని గిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నార్త్‌జోన్‌ కెప్టెన్‌గా గిల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. తాజాగా ప్రకటించిన జట్టులో గిల్‌తో పాటు యువ పేసర్లు అర్ష్‌దీప్‌, హర్షిత్ రాణా, అన్షుల్‌ కాంబోజ్‌ కూడా చోటు దక్కించుకున్నారు. గిల్‌కు డిప్యూటీగా అంకిత్‌ కుమార్‌ ఎంపికయ్యాడు.

ఇంగ్లండ్‌పై గడ్డపై అదుర్స్‌..
ఇంగ్లండ్‌పై శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, ఆటగాడిగా అదరగొట్టాడు. ఈ పంజాబ్ ఆటగాడు కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లో మంచి మార్క్‌లు కొట్టేశాడు. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను గిల్ సారథ్యంలోని భారత జట్టు 2-2తో సమం చేసింది. సిరీస్ సమంగా ముగియడంలో గిల్‌ది కీలక పాత్ర.

ఈ సిరీస్‌లో గిల్ పరుగులు వరద పారించాడు. ఐదు మ్యాచ్‌లలో 75.40 సగటుతో 754 పరుగులు చేసి గిల్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఎడ్జ్‌బాస్ట‌న్‌లో జ‌రిగిన రెండో టెస్టులో గిల్(261) ఏకంగా డ‌బుల్ సెంచ‌రీతో చెల‌రేగాడు. అదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 161 ప‌రుగులు చేశాడు.

ఒక టెస్టు మ్యాచ్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో ప్లేయ‌ర్‌గా గిల్‌(430) నిలిచాడు. గిల్ ఇంకా ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు.  త్వరలోనే భారత్‌కు రానున్న గిల్‌.. ఈ నెల ఆఖరిలో జరగనున్న దులీప్ ట్రోఫీలో ఆడ‌నున్నాడు. ఆగష్టు 28- 31వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న తొలి క్వార్ట‌ర్ ఫైన‌ల్లో ఈస్ట్‌జోన్‌తో నార్త్ జోన్ త‌ల‌ప‌డ‌నుంది.

ఒక‌వేళ నార్త్ జోన్ సెమీఫైన‌ల్‌కు చేరిన గిల్ ఆడే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయి. ఎందుకంటే సెప్టెంబ‌ర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియాక‌ప్‌లో కూడా గిల్ ఆడ‌నున్న‌ట్లు తెలుస్తోంది.  సెప్టెంబర్ నుంచి అంతర్జాతీయ సిరీస్‌లలో గిల్ బీజీబీజీగా గడపనున్నాడు. తొలుత ఆసియాకప్‌, ఆతర్వాత వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌, ఆస్ట్రేలియాతో వైట్‌బాల్ సిరీస్‌లలో ఆడనున్నాడు. ఆసీస్ టూర్ ముగిసిన వెంటనే రెం‍డు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది.

దులిప్‌ ట్రోఫీ-2025కి నార్త్‌జోన్‌ జట్టు ఇదే
శుభమన్ గిల్ (కెప్టెన్‌), శుభమ్ ఖజురియా, అంకిత్ కుమార్ (వైస్‌ కెప్టెన్‌), ఆయుష్ బదోని, యశ్ ధుల్, అంకిత్ కల్సి, నిశాంత్ సింధు, సాహిల్ లోత్రా, మయాంక్ దాగర్, యుధ్వీర్ సింగ్ చరక్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఆకిబ్ నబీ, కన్హయ్య వాధావాన్.
చదవండి: IND vs WI: అతడి ఖేల్‌ ఖతం.. శ్రేయస్‌ అయ్యర్‌ రీ ఎంట్రీ పక్కా!
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)