Breaking News

రిషబ్‌ పంత్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. వైరల్‌ వీడియో

Published on Sun, 09/08/2024 - 18:10

బెంగళూరు వేదికగా జరిగిన దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా-బి వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ అద్భుమైన డైవింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. నవ్‌దీప్‌ బౌలింగ్‌లో పంత్‌ లెగ్‌ సైడ్‌ దిశగా వెళ్తున్న బంతిని పక్షిలా గాల్లో ఎగిరి సూపర్‌ క్యాచ్‌గా మలిచాడు. పంత్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతుంది. పంత్‌ పట్టుకున్న క్యాచ్‌ ఇండియా-ఏ బ్యాటర్‌ ఆవేశ్‌ ఖాన్‌ది. 

ఈ మ్యాచ్‌లో పంత్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ఇండియా-బి.. ఇండియా-ఏపై 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం చేసి ఇండియా-బి విజయానికి పునాది వేసిన ముషీర్‌ ఖాన్‌కు (181) ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులకు ఆలౌటైంది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును ముషీర్‌ ఖాన్‌, నవ్‌దీప్‌ సైనీ (56) ఆదుకున్నారు. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్‌దీప్‌ 4, ఖలీల్‌ అహ్మద్‌, ఆవేశ్‌ ఖాన్‌ తలో 2, కుల్దీప్‌ యాదవ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

ఇండియా-బి బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌటైంది. ముకేశ్‌ కుమార్‌, నవ్‌దీప్‌ సైనీ తలో 3, సాయికిషోర్‌ 2, యశ్‌ దయాల్‌, సుందర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ఇండియా-ఏ ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ (37) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఇండియా-ఏ బౌలర్‌ ఆకాశ్‌దీప్‌ ఐదు వికెట్లతో రాణించడంతో ఇండియా-బి రెండో ఇన్నింగ్స్‌లో 184 పరుగులకు ఆలౌటైంది. ఖలీల్‌ అహ్మద్‌ 3, ఆవేశ్‌ ఖాన్‌, తనుశ్‌ కోటియన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో రిషబ్‌ పంత్‌ (61), సర్ఫరాజ్‌ ఖాన్‌ (46) మాత్రమే రాణించారు. వికెట్‌కీపర్‌ ధృవ్‌ జురెల్‌ ఏడు క్యాచ్‌లు పట్టుకున్నాడు.

275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-ఏ.. 198 పరుగులకు ఆలౌటైంది. కేఎల్‌ రాహుల్‌ (57) ఇండియా-ఏను ఆదుకునేందుకు విఫలయత్నం చేశాడు. ఆఖర్లో ఆకాశ్‌దీప్‌ (43) వేగంగా పరుగులు సాధించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇండియా-బి బౌలర్లలో యశ్‌ దయాల్‌ 3, ముకేశ్‌ కుమార్‌, నవ్‌దీప్‌ సైనీ తలో 2, సుందర్‌, నితీశ్‌ రెడ్డి చెరో వికెట్‌ పడగొట్టారు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)