Breaking News

Duleep Trophy 2024: ముషీర్‌ ఖాన్‌ సూపర్‌ సెంచరీ

Published on Thu, 09/05/2024 - 17:03

దులీప్‌ ట్రోఫీ-2024లో భాగంగా బెంగళూరు వేదికగా ఇండియా-ఏతో ఇవాళ (సెప్టెంబర్‌ 5) మొదలైన మ్యాచ్‌లో ఇండియా-బి ఆటగాడు ముషీర్‌ ఖాన్‌ సూపర్‌ సెంచరీతో (105 నాటౌట్‌; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిశాడు. ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన ముషీర్‌.. ఓ పక్క సహచరులంతా పెవిలియన్‌కు క్యూ కడుతున్నా తాను మాత్రం చాలా జాగ్రత్తగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముషీర్‌కు మరో ఎండ్‌లో నవ్‌దీప్‌ సైనీ (29 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) సహకారం అందిస్తున్నాడు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఇండియా-బి 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ముషీర్‌, సైనీ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించే దిశగా తీసుకెళ్తున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. 

ఇండియా-బి ఇన్నింగ్స్‌లో ముషీర్‌ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. జట్టులో అంతర్జాతీయ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్‌ (30), సర్ఫరాజ్‌ ఖాన్‌ (9), రిషబ్‌ పంత్‌ (7), వాషింగ్టన్‌ సుందర్‌ (0) ఉన్నా, వీరు తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు.  అభిమన్యు ఈశ్వరన్‌ 13,  నితీశ్‌ రెడ్డి 0, సాయికిషోర్‌ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌, ఆకాశ్‌దీప్‌, ఆవేశ్‌ ఖాన్‌ తలో రెండు వికెట్లు తీశారు.

 

 

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?