Breaking News

టీమిండియా ప్లేయర్లు విఫలం.. 36 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఇండియా-సి

Published on Thu, 09/19/2024 - 13:11

దులీప్‌ ట్రోఫీ 2024లో ఇవాళ (సెప్టెంబర్‌ 19) మూడో రౌండ్‌ మ్యాచ్‌లు మొదలయ్యాయి. తొలి మ్యాచ్‌లో ఇండియా-డి, ఇండియా-బి తలపడుతుండగా.. రెండో మ్యాచ్‌లో ఇండియా-ఏ, ఇండియా-సి జట్లు పోటీపడుతున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు అనంతపురం ఆర్డీటీ స్టేడియమ్స్‌లో జరుగుతున్నాయి.

టీమిండియా ప్లేయర్లు విఫలం
ఇండియా-సితో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-ఏ తొలుత బ్యాటింగ్‌ చేస్తుంది. టీమిండియా ప్లేయర్లు మయాంక్‌ అగర్వాల్‌ (6), తిలక్‌ వర్మ (5), రియాన్‌ పరాగ్‌ (2) తక్కువ స్కోర్లకే ఔట్‌ కావడంతో ఆ జట్టు 36 పరుగులకే సగం​ వికెట్లు కోల్పోయింది. లంచ్‌ విరామం సమయానికి ఇండియా-ఏ స్కోర్‌ 67/5గా ఉంది. 

షాశ్వత్‌ రావత్‌ (20), షమ్స్‌ ములానీ (19) ఇండియా-ఏని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌, అన్షుల్‌ కంబోజ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

అర్ద సెంచరీల దిశగా పడిక్కల్‌, శ్రీకర్‌ భరత్‌
ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-డి తొలుత బ్యాటింగ్‌ చేస్తుంది. లంచ్‌ విరామం సమయానికి ఆ జట్టు వికెట్‌ నష్టపోకుండా 98 పరుగులు చేసింది. ఓపెనర్లు దేవ్‌దత్‌ పడిక్కల్‌ (44), శ్రీకర్‌ భరత్‌ (46) అర్ద సెంచరీల దిశగా సాగుతున్నారు.

పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఇండియా-సి తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇండియా-బి ఏడు, ఇండియా-ఏ ఆరు పాయింట్లతో రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఇండియా-డి సున్నా పాయింట్లతో చిట్టచివరి స్థానంలో ఉంది.  

చదవండి: ఆండ్రీ రసెల్‌ విధ్వంసం.. నైట్‌ రైడర్స్‌ ఖాతాలో మరో విజయం
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)