Breaking News

శ్రేయస్‌ సేనపై రుతురాజ్‌ టీమ్‌ ఘన విజయం

Published on Sat, 09/07/2024 - 16:00

దులీప్‌ ట్రోఫీలో భాగంగా అనంతపురం వేదికగా ఇండియా-డితో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-సి టీమ్‌ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా-డి.. అక్షర్‌ పటేల్‌ (86) ఆదుకోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 164 చేసింది. ఇండియా-సి బౌలర్లలో విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ 3, అన్షుల్‌ కంబోజ్‌, హిమాన్షు చౌహాన్‌ తలో 2, మానవ్‌ సుతార్‌, హృతిక్‌ షోకీన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇండియా-సి.. బాబా ఇంద్రజిత్‌ (72) మినహా ఎవరూ రాణించకడంతో 168 పరుగులు చేయగలిగింది. హర్షిత్‌ రాణా (4/33), అక్షర్‌ పటేల్‌ (2/46), సరాన్ష్‌ జైన్‌ (2/16), అర్ష్‌దీప్‌ సింగ్‌ (1/29), ఆదిత్య థాకరే (1/33) ఇండియా-సిని దెబ్బకొట్టారు.

దీని తర్వాత రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఇండియా-డి.. శ్రేయస్‌ అయ్యర్‌ (54), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (56), రికీ భుయ్‌ (44) రాణించడంతో 236 పరుగులకు ఆలౌటైంది. మానవ్‌ సుతార్‌ 7 వికెట్లు తీసి ఇండియా-డిని దారుణంగా దెబ్బతీశాడు. విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ 2, అన్షుల్‌ కంబోజ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 233 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-సి.. రుతురాజ్‌ గైక్వాడ్‌ (46), సాయి సుదర్శన్‌ (22), ఆర్యన్‌ జుయెల్‌ (47), రజత్‌ పాటిదార్‌ (44), అభిషేక్‌ పోరెల్‌ (35 నాటౌట్‌) తలో చేయి వేయడంతో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. సరాన్ష్‌ జైన్‌ 4, అర్ష్‌దీప్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  కాగా, ఇండియా-సికి రుతురాజ్‌.. ఇండియా-డికి శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)