Breaking News

సీఎస్‌కే ప్లేయర్‌ సూపర్‌ సెంచరీ

Published on Thu, 06/29/2023 - 11:45

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సభ్యుడిగా ఉన్న ఆటగాడు దులీప్‌ ట్రోఫీ-2023లో సూపర్‌ సెంచరీతో మెరిశాడు. దులీప్‌ ట్రోఫీలో భాగంగా నార్త్‌ ఈస్ట్‌ జోన్‌తో జరుగుతున్న రెండో క్వార్టర్‌ ఫైనల్లో నార్త్‌ జోన్‌ ఆటగాడు నిశాంత్‌ సింధు (111 నాటౌట్‌) అద్భుతమైన శతకం బాదాడు. రెండో రోజు ఆటలో (ఇవాళ) నిశాంత్‌ సెంచరీ మార్కును అందుకున్నాడు. అంతకుముందు తొలి రోజు ఆటలో ధృవ్‌ షోరే (135) సెంచరీ చేశాడు. రెండో రోజు తొలి సెషన్‌ సమయానికి (103 ఓవర్లు) నార్త్‌ జోన్‌ 6 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. నిశాంత్‌కు జతగా పుల్కిత్‌ నారంగ్‌ (39) క్రీజ్‌లో ఉన్నాడు. 

కాగా, ఐపీఎల్‌-2023 వేలంలో నిశాంత్‌ సింధును చెన్నై సూపర్‌ కింగ్స్‌ 60 లక్షల ధరకు కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్‌లో అతని ఒక్క మ్యాచ్‌ ఆడే అవకాశం కూడా రాలేదు. 2022 అండర్‌-19 వరల్డ్‌కప్‌లో కనబర్చిన అద్భుతమైన ప్రదర్శన కారణంగా నిశాంత్‌కు ఐపీఎల్‌ ఆఫర్‌ వచ్చింది. నాటి వరల్డ్‌కప్‌ ఫైనల్లో నిషాంత్‌ వీరోచితంగా పోరాడి హాఫ్‌ సెంచరీ సాధించాడు. నిషాంత్‌ దేశవాళీ క్రికెట్‌లో ఇప్పటివరకు 12 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు (2 సెంచరీలు, 3 అర్ధసెంచరీలు), 7 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు, 8 టీ20లు ఆడాడు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)