Breaking News

రాణించిన మంత్రి.. తిప్పేసిన సౌరభ్‌ కుమార్‌

Published on Sat, 07/01/2023 - 07:01

బెంగళూరు: దులీప్‌ ట్రోఫీ క్వా­ర్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో సెంట్రల్‌ జోన్, నార్త్‌జోన్‌ జట్లు గెలుపు దిశగా పయనిస్తున్నాయి. ఈస్ట్‌జోన్‌తో జరుగుతున్న పోరులో సెంట్రల్‌ ఆటగాళ్లు  హిమాన్షు మంత్రి (68; 7 ఫోర్లు), వివేక్‌ సింగ్‌ (56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాటింగ్‌లో రాణించగా, సౌరభ్‌ కుమార్‌ (4/33) స్పిన్‌ బౌలింగ్‌తో తిప్పేశాడు. శుక్రవారం 64/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటప్రారంభించిన సెంట్రల్‌జోన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 87.5 ఓవర్లలో 239 పరుగుల వద్ద ఆలౌటైంది.

ఓపెనర్లు హిమాన్షు మంత్రి, వివేక్‌సింగ్‌ తొలి వికెట్‌కు 124 పరుగులు జోడించారు.  అనంతరం 300 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన ఈస్ట్‌జోన్‌ సౌరభ్‌ స్పిన్‌ ఉచ్చులో పడింది. ఆట ముగిసే సమయానికి 29 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 69 పరుగులే చేసింది.  

నార్త్‌ ఆల్‌రౌండ్‌ దెబ్బకు... 
నార్త్‌జోన్‌ ఆల్‌రౌండ్‌ దెబ్బకు నార్త్‌ ఈస్ట్‌జోన్‌ కుదేలైంది. దీంతో మూడో రోజు ఆటలోనే నార్త్‌ ఈస్ట్‌జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లను కోల్పోయింది. మొదట 65/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన నార్త్‌ ఈస్ట్‌జోన్‌ 39.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది.

దీంతో నార్త్‌కు 406 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను నార్త్‌జోన్‌ 55.1 ఓవర్లలో 259/6 వద్ద డిక్లేర్‌ చేసింది. ప్రభ్‌ సిమ్రన్‌సింగ్‌  (59; 9 ఫోర్లు, 1 సిక్స్‌), అంకిత్‌ (70; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. దీంతో ప్రత్యర్థికి 666 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, నార్త్‌ ఈస్ట్‌జోన్‌ ఆట నిలిచే సమయానికి 18 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది.   
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)