Breaking News

గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్‌.. పూరన్‌, పోలార్డ్‌ కూడా ఏమీ చేయలేకపోయారు..!

Published on Sun, 01/12/2025 - 11:26

దుబాయ్‌ వేదికగా జరిగే ఇంటర్నేషన్‌ లీగ్‌ టీ20, 2025 ఎడిషన్‌ (రెండో ఎడిషన్‌) నిన్న (జనవరి 11) ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఎమిరేట్స్‌.. దుబాయ్‌ క్యాపిటల్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌కు పరాభవం ఎదురైంది. తప్పక గెలుస్తుందనున్న మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌ పరుగు తేడాతో ఓటమిపాలైంది. విధ్వంసకర ఆటగాళ్లు నికోలస్‌ పూరన్‌, కీరన్‌ పోలార్డ్‌ జట్టులో ఉన్నా ముంబై ఇండియన్స్‌ను గెలిపించలేకపోయారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దుబాయ్‌ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. దుబాయ్‌ ఆటగాళ్లలో బ్రాండన్‌ మెక్‌ముల్లెన్‌ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. రోవమన్‌ పావెల్‌ (25), దసున్‌ షనక (13), కెప్టెన్‌ సికందర్‌ రజా (10) రెండంకెల స్కోర్లు చేయగా.. షాయ్‌ హోప్‌ 9, రొస్సింగ్టన్‌ 9, గుల్బదిన్‌ నైబ్‌ 2, ఫర్హాన్‌ ఖాన్‌ 2 (నాటౌట్‌) పరుగులు చేశారు. ముంబై పేసర్‌ ఫజల్‌హక్‌ ఫారూకీ (4-0-16-5) ఐదు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్‌ చేసి దుబాయ్‌ క్యాపిటల్స్‌ను ఇబ్బంది పెట్టాడు. అల్జరీ జోసఫ్‌, జహూర్‌ ఖాన్‌కు తలో వికెట్‌ దక్కింది.

స్వల్ప లక్ష్య ఛేదనలో ఎంఐ ఎమిరేట్స్‌ కూడా తడబడింది. ఆ జట్టు 23 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ (40 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) తన జట్టును గెలిపించుకునేందుకు విఫలయత్నం చేశాడు. పూరన్‌కు అకీల్‌ హొసేన్‌ (31 బంతుల్లో 30; 2 ఫోర్లు) కాసేపు సహకరించాడు. ఆఖరి ఓవర్‌లో కీరన్‌ పోలార్డ్‌ (15 బంతుల్లో 16 నాటౌట్‌; 2 ఫోర్లు) ఎంత ప్రయత్నించినా తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. చివరి బంతికి ఆరు పరుగులు కావాల్సి ఉండగా పోలార్డ్‌ బౌండరీ బాదాడు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. 

దుబాయ్‌ క్యాపిటల్స్‌ పరుగు తేడాతో గెలుపొందింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఎంఐ ఎమిరేట్స్‌ 7 వికెట్ల కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. ఎమిరేట్స్‌ ఇన్నింగ్స్‌లో ముహమ్మద్‌ వసీం, ఆండ్రీ ఫ్లెచర్‌, అ‍ల్జరీ జోసఫ్‌ డకౌట్‌లు కాగా.. కుసాల్‌ పెరీరా 12, టామ్‌ బాంటన్‌ 7 పరుగులు చేశారు.

గెలుపు దూరం​ చేసిన గుల్బదిన్‌ నైబ్‌, ఓల్లీ స్టోన్‌
ఓ దశలో ఎంఐ ఎమిరేట్స్‌ సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. ఆ జట్టు 18 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే సాధించాల్సి ఉండింది. చేతిలో ఐదు వికెట్లు ఉండేవి. ఈ దశలో గుల్బదిన్‌ నైబ్‌ (4-0-13-3, ఓల్లీ స్టోన్‌ (4-1-14-2) ముంబైకు గెలుపును దూరం చేశారు. 18వ ఓవర్‌ వేసిన గుల్బదిన్‌ నైబ్‌ రెండు కీలక వికెట్లు తీసి (పూరన్‌, అల్జరీ జోసఫ్‌) కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. 

అనంతరం 19వ ఓవర్‌ వేసిన ఓల్లీ స్టోన్‌ మరింత పొదుపుగా బౌలింగ్‌ చేసి కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. చివరి ఓవర్‌ వచ్చే సరికి ముంబై గెలుపుకు 13 పరుగులు అవసరమయ్యాయి. ఫర్హాన్‌ ఖాన్‌ బౌలింగ్‌లో పోలార్డ్‌ రెండు బౌండరీలు బాదినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ఓవర్‌లో 11 పరుగులు మాత్రమే వచ్చాయి. పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు కీలకమైన వికెట్లు తీసిన గుల్బదిన్‌ నైబ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 
 

Videos

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు