Breaking News

‘డ్రీమ్‌’ బంధం ముగిసినట్లే!

Published on Sat, 08/23/2025 - 00:43

న్యూఢిల్లీ: ‘సెబీ’ నిబంధనలు ఉల్లంఘించిన సహారా గ్రూప్, కాంపిటీషన్‌ కమిషన్‌ విచారణను ఎదుర్కొన్న స్టార్‌ ఇండియా, ఆర్థిక సమస్యలతో ఒప్పో, చెల్లింపులు చేయలేక బాకీపడ్డ బైజూస్‌... భారత క్రికెట్‌ జట్టు గత నాలుగు ప్రధాన స్పాన్సర్లు ఏదో ఒక వివాదం లేదా సమస్యతో సహవాసం చేయడం బీసీసీఐకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ జాబితాలో ‘డ్రీమ్‌ 11’ కూడా చేరింది. ఇందులో నేరుగా కంపెనీ పాత్ర లేకపోయినా... ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంతో పరిస్థితి మారిపోయింది. 

ఇకపై ‘డ్రీమ్‌ 11’ భారత టీమ్‌ స్పాన్సర్‌గా కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. ఆన్‌లైన్‌ ఫాంటసీ స్పోర్ట్స్, గ్యాంబ్లింగ్‌ వేదికలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇదే కేటగిరీలో వచ్చే ‘డ్రీమ్‌ 11’కు దీని కారణంగా ఆర్థిక పరంగా గట్టి దెబ్బ తగలనుంది. 2023లో రూ. 358 కోట్లతో మూడేళ్ల కాలానికి బీసీసీఐతో ‘డ్రీమ్‌ 11’ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్ట్‌ 2026 మార్చి వరకు ఉంది. అయితే ఆసియా కప్‌కు ముందే స్పాన్సర్‌షిప్‌ ఒప్పందం రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

బోర్డు కార్యదర్శి దేవజిత్‌ సైకియా చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ‘ఫలానా సంస్థతో ఒప్పందానికి అనుమతి లేదంటే మేం ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్లం. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతీ పాలసీ, నిబంధనలను బీసీసీఐ పాటిస్తుంది’ అని ఆయన చెప్పారు. ఈ స్పాన్సర్‌షి-ప్‌కు సంబంధించి త్వరలోనే మరింత స్పష్టత రావచ్చు. తక్కువ సమయంలో బోర్డు మళ్లీ కొత్త స్పాన్సర్‌తో ఒప్పందం కుదుర్చుకుంటుందా అనేది ఆసక్తికరం. మరోవైపు డ్రీమ్‌ 11 శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. 

‘డబ్బులు చెల్లించి ఆడే పోటీలన్నింటినీ మేం నిలిపివేశాం. ఉచితంగా ఆడుకునే ఆన్‌లైన్‌ సోషల్‌ గేమ్‌లుగా వాటిని మార్చేశాం. ఇన్నేళ్లు మేం నిబంధనల ప్రకారమే పని చేశాం. భారత ప్రభుత్వ చట్టాలను మేం గౌరవిస్తే. ఇకపై మా ఇతర సంస్థలు ఫ్యాన్‌ కోడ్, డ్రీమ్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా క్రీడలతో అనుబంధాన్ని కొనసాగిస్తాం’ అని పేర్కొంది. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)