Breaking News

బెన్‌ స్టోక్స్‌ నోటి దురుసు.. అస్సలు నీవు కెప్టెన్‌వేనా? వీడియో వైరల్‌

Published on Mon, 07/28/2025 - 11:04

మాంచెస్టర్‌ టెస్టును టీమిండియా ఆద్వితీయ పోరాటంతో డ్రా ముగించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తమ ఆశలను భారత్‌ సజీవంగా నిలుపునకుంది. ఓవర్‌ నైట్‌స్కోర్‌ 171/2తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌.. కేఎల్‌ రాహుల్‌(90) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది.

లంచ్‌ విరామానికి ముందు ఇన్‌ఫామ్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌(103) కూడా పెవిలియన్‌కు చేరాడు. దీంతో భారత్‌ ఓటమి తప్పదని అంతా భావించారు. ఈ క్రమంలో సర్‌ రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ అద్బుతం చేశారు. వీరిద్దరూ తమ ఆసాధరణ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ ప్లేయర్లు విసుగుతెప్పించారు.

ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికి ఈ జోడీని ఇంగ్లండ్‌ విడగొట్టలేకపోయింది. ఇద్దరూ కలసి ఐదో వికెట్‌కు 203 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. అయితే వీరిని ఔట్‌ చేయలేక అలిసిపోయిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌.. 15 ఓవర్ల ఆట మిగిలూండగానే చేతులెత్తేశాడు.

స్టోక్స్‌ డ్రా ఆఫర్ చేస్తూ రవీంద్ర జడేజా వద్దకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అందుకు జడేజా తిరస్కరించాడు. నాకేమి సంబంధం లేదు, కెప్టెన్‌ చెప్పినట్లు చేస్తా అని జడ్డూ సమాధనమిచ్చాడు. అయితే అప్పటికే రవీంద్ర జడేజా 89 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 80 పరుగులు చేసి సెంచరీలకు చేరువలో ఉన్నారు. 

అందుకే వారిద్దరూ డ్రాకు అంగీకరించలేదు. దీంతో సహనం కోల్పో‍యిన స్టోక్స్‌ తన నోటికి పనిచెప్పాడు. బ్రూక్, బెన్ డకెట్ బౌలింగ్‌లో సెంచరీలు చేయాలనుకుంటున్నారా అంటూ జడేజాతో వెటకారంగా అన్నాడు. ఇంగ్లండ్‌ ప్లేయర్లు కూడా స్టోక్స్‌కు జతయ్యారు. జాక్‌ క్రాలీ డ్రాకు ఒప్పుకొవచ్చుగా అని జడేజాతో అన్నాడు.

కానీ జడేజా, సుందర్‌ మాత్రం ఒకే మాటపై ముందుకు వెళ్లారు. స్టోక్స్‌ అన్నవిధంగానే పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌ హ్యారీ బ్రూక్‌కు బంతి అందించాడు. బ్రూక్‌ గల్లీ క్రికెట్‌లో బౌలింగ్‌ చేసినట్లు చేశాడు.  అతడి బౌలింగ్‌లోనే సిక్స్ బాది జడేజా(107) సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆ తర్వాత రెండు ఓవర్లకే సుందర్‌(101) తన తొలి టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

కాగా ఈ మ్యాచ్‌లో స్టోక్స్‌ ప్రవర్తనపై నెటిజన్లు ఫైరవతున్నారు. అస్సలు నీకు క్రీడాస్పూర్తి ఉందా? ఆ స్దానంలో మీ ప్లేయర్లు ఉంటే ప్రత్యర్ధి కెప్టెన్‌ ఇలా చేస్తే ఊరుకుంటావా? అని సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా



 

 

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)