Breaking News

19 సిక్సర్లు.. సెంచరీ... ఎవరీ అరివీర భయంకర బ్యాట్స్‌మెన్‌?

Published on Sat, 08/31/2024 - 19:47

ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్‌-2024లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ కెప్టెన్ ఆయుష్ బ‌దోని విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో భాగంగా నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో బదోని చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఈ యువ సంచలనం ఊచకోత కోశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్టేడియం నలుమూలులా సిక్సర్ల బాదుతూ తన విశ్వరూపాన్ని బదోని చూపించాడు. ఈ క్రమంలో కేవలం 39 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

 ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో​ కేవలం 55 బంతులు మాత్రమే ఎదుర్కొన్న బదోని 8 ఫోర్లు, 19 సిక్స్‌లతో ఏకంగా 165 పరుగులు చేశాడు. అతడితో పాటు ఓపెనర్ ప్రియాంష్ ఆర్య విధ్వంస‌క‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. 50 బంతులు ఎదుర్కొన్న ఆర్య‌.. 10 ఫోర్లు, 10 సిక్స్‌ల‌తో 120 ప‌రుగులు సాధించాడు.

దీంతో సౌత్ ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 308 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 309 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198 ప‌రుగులే చేసింది. దీంతో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ 112 ప‌రుగుల తేడాతో ఓట‌మి చ‌విచూసింది.

అంతా గంభీర్ వల్లే..
ఆయుష్ బ‌దోని స‌క్సెస్ వెన‌క టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఉన్నాడనే చెప్పకోవాలి. బదోని కెరీర్‌ ఎదుగుదలలో గంభీర్‌ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు బదోని ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు.

2022 సీజ‌న్‌లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌లోకి బ‌దోని అడుగుపెట్టాడు. అయితే ఇదే సమయంలో లక్నో మెంటార్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతీ.. తన అనుభవంతో బదోనిని రాటుదేల్చాడు. కాగా లక్నో జట్టులోకి బదోని రావడానికి గల కారణం కూడా గౌతీనే. 

ఐపీఎల్‌లో వేలంలో అతడి సలహా మెరకే బదోనిని లక్నో ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. రెండు సీజన్ల పాటు లక్నో మెంటార్‌గా కొనసాగిన గంభీర్‌.. బదోనికి ఎంతో సపోర్ట్‌గా నిలిచాడు. ఈ విషయాన్ని చాలా సందర్బాల్లో అయూష్‌ సైతం ధ్రువీకరించాడు. గంభీర్‌కు తనకు పెద్దన్న లాంటి వాడని అయూష్‌ పలుమార్లు చెప్పుకొచ్చాడు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)