Breaking News

ఆమెతో పెళ్లి, విడాకులు.. తొలిసారి స్పందించిన షమీ

Published on Fri, 08/29/2025 - 13:05

టీమిండియా ఉత్తమ ఫాస్ట్‌బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు మహ్మద్‌ షమీ (Mohammed Shami). ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ కుడిచేతివాటం పేసర్‌ దేశీ క్రికెట్‌లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ జాతీయ జట్టులోకి వచ్చాడు. అంచెలంచెలుగా ఎదిగి భారత పేస్‌ విభాగంలో కీలక ఆటగాడిగా మారాడు.

అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 64 టెస్టులు, 108 వన్డేలు, 25 టీ20 మ్యాచ్‌లు ఆడిన షమీ.. ఆయా ఫార్మాట్లలో 229చ 206, 27 వికెట్లు కూల్చాడు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భాగంగా టీమిండియాకు చివరగా ఆడిన షమీ.. ప్రస్తుతం దులిప్‌ ట్రోఫీ-2025 టోర్నీతో బిజీగా ఉన్నాడు.

సాఫీగా సాగని వ్యక్తిగత జీవితం
ఆట పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న 34 ఏళ్ల షమీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్‌లో చీర్‌ లీడర్‌గా పనిచేసిన హసీన్‌ జహాన్‌ (Hasin Jahan)ను ప్రేమించిన షమీ 2014లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది.

అయితే, కొన్నేళ్ల క్రితం వీరి బంధం బీటలు వారగా.. హసీన్‌ జహాన్‌ షమీపై సంచలన ఆరోపణలు చేసింది. షమీ స్త్రీలోలుడని, మ్యాచ్‌ ఫిక్సింగ్‌లు చేస్తాడని.. తనపై గృహహింసకు పాల్పడ్డాడంటూ తీవ్ర ఆరోపణలతో అతడిని కోర్టు మెట్లు ఎక్కించింది. అంతేకాదు.. భరణంగా నెలకు రూ. 10 లక్షలు చెల్లించేలా తీర్పునివ్వాలని న్యాయస్థానానికి విన్నవించుకుంది.

తొలిసారి స్పందించిన షమీ
ఈ క్రమంలో ఇటీవలే కోల్‌కతా కోర్టు ఈ విషయంలో తీర్పునిచ్చింది. నెలకు రూ. 4 లక్షలు భరణంగా చెల్లించాలని షమీని ఆదేశించింది. ఈ పరిణామాల గురించి షమీ తొలిసారి స్పందించాడు. ‘‘ఆ విషయాన్ని వదిలేయడమే మంచిది. గతం గురించి నేనెప్పుడూ ఆలోచించను.

జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయంలో ఎవరినీ నిందించాలని అనుకోవడం లేదు. నన్ను నేను కూడా నిందించుకోను. ప్రస్తుతం నా దృష్టి మొత్తం కేవలం క్రికెట్‌ మీద మాత్రమే ఉంది. నాకు వివాదాల్లో తలదూర్చడం ఏమాత్రం ఇష్టం లేదు’’ అని షమీ పేర్కొన్నాడు.

వివాదాలకు నేను దూరం
ఈ సందర్భంగా.. భార్య ధనశ్రీ వర్మతో ఇటీవల విడాకులు తీసుకున్న టీమిండియా స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ గురించి షమీకి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘దాని గురించి విచారణ చేయడం మీ పని. 

మమ్మల్ని చావు అంచులదాకా తీసుకువెళ్లాలని మీరు ఎందుకు అనుకుంటారు? నాణేనికి మరోవైపు కూడా చూడండి. ముందుగానే చెప్పాను.. నా దృష్టంతా ఆట మీదనే.. వివాదాలకు నేను దూరం’’ అని షమీ కుండబద్దలు కొట్టాడు.  

చదవండి: టాలీవుడ్ హీరోయిన్‌తో పృథ్వీ షా ప్రేమాయణం..!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)