Breaking News

30 ఏళ్లకే వీడ్కోలు.. ఊహించని ట్విస్ట్‌తో మాజీ చాంప్‌ రీఎంట్రీ!

Published on Sat, 07/25/2026 - 11:49

మాజీ యూఎస్ ఓపెన్ చాంపియ‌న్‌, ఆస్ట్రియా మాజీ టెన్నిస్‌ ప్లేయర్‌ డొమినిక్ థీమ్ మళ్లీ గ్రౌండ్‌లో అడుగుపెట్ట‌నున్నాడు. కెరీర్‌ పీక్ ద‌శ‌లో ఉన్నప్పుడే 30 ఏళ్ల వ‌య‌సులో థీమ్‌ అనూహ్యంగా టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పి క్రీడా ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్యానికి గురి చేశాడు. అయితే రెండేళ్ల తర్వాత మాజీ చాంపియన్‌ రీఎంట్రీ ఇస్తున్నప్పటికీ ఇక్కడే ఊహించని ట్విస్ట్‌ ఒకటి దాగుంది. అదేంటంటే థీమ్‌ ఈసారి టెన్నిస్ ప్లేయ‌ర్‌గా కాకుండా ఫుట్‌బాల‌ర్‌గా అడుగుపెట్టనుండడమే!


Photo Credit: Twitter

ఆస్ట్రియా ఫుట్‌బాల్ లీగ్‌లో డొమినిక్ థీమ్ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ప‌లు నివేదిక‌లు అందించిన స‌మాచారం మేర‌కు డొమినిక్ థీమ్ ఇప్ప‌టికే ఆస్ట్రియాకు చెందిన అమెచ్యూర్ ఫుట్‌బాల్ క్ల‌బ్ అయిన బాడెనర్ ఏసీ త‌ర‌ఫున త‌న పేరును రిజిస్ట‌ర్ చేయించుకున్న‌ట్లు తెలుస్తోంది. 

టెన్నిస్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన త‌ర్వాత త‌న హోమ్‌టౌన్ క్ల‌బ్ ఎస్‌సీ లిచ్టెన్‌వ‌ర్త్ (బాడెన‌ర్ క్ల‌బ్‌లో జాయిన్ కాక‌ముందు) త‌ర‌ఫున ప‌ది మ్యాచ్‌లు ఆడిన డొమినిక్ థీమ్ ఒక గోల్ కూడా చేయ‌డం విశేషం. టెన్నిస్‌లో స్టార్ ఆట‌గాడి హోదా పొందిన‌ప్ప‌టికీ, ఫుట్‌బాల్‌లో మాత్రం ఒక సాధార‌ణ ప్లేయ‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. అందుకే అత‌డు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఫుట్‌బాల్ క్ల‌బ్ కూడా ఇప్ప‌టికీ డ్రెసింగ్ రూమ్‌లో ప్ర‌త్యేక లాక‌ర్ లేదా ఇతర స‌దుపాయాలు ఇవ్వ‌లేదు.


Photo Credit: Twitter

వ‌రుస గాయాలతో వీడ్కోలు..
2020 యూఎస్ ఓపెన్ చాంపియ‌న్‌గా నిలిచిన డొమినిక్ థీమ్ 2024లో టెన్నిస్‌కు వీడ్కోలు ప‌లికాడు. అప్ప‌టికీ 30 ఏళ్ల వ‌య‌సు మాత్ర‌మే ఉన్న డొమినిక్ థీమ్ అనూహ్యంగీ వీడ్కోలు ప‌ల‌క‌డం వెనుక వ‌రుస గాయాలు అత‌డిని ఇబ్బంది పెట్ట‌డ‌మే. 2020లో యూఎస్ ఓపెన్ గెలిచిన త‌ర్వాత 2021లో ఏడుసార్లు మ‌ణిక‌ట్టు గాయానికి గుర‌వ్వ‌డంతో రెండేళ్ల పాటు ఆట‌కు దూర‌మ‌వ్వాల్సి వ‌చ్చింది. 


Photo Credit: Twitter

కెరీర్‌లో పీక్ ఫామ్‌లో ఉన్న స‌మ‌యంలో వ‌రుస గాయాలకు తోడు 2024లో యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే డొమినిక్ థీమ్ ఇంటిబాట ప‌ట్టాడు. దీంతో టెన్నిస్‌కు వీడ్కోలు ప‌ల‌కాల‌ని ఆరోజే నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇక వియ‌న్నా ఓపెన్‌లో తొలి రౌండ్‌లో ఇట‌లీకి చెందిన లూసియానో ​​దార్దేరి చేతిలో రెండు సెట్ల‌లోనే డొమినిక్ థీమ్ ప‌రాజ‌యం చ‌విచూశాడు. 

టెన్నిస్‌లో థీమ్‌కు ఇదే ఆఖ‌రి మ్యాచ్ కావ‌డం విశేషం. 30 ఏళ్ల వ‌య‌సులో పీక్ ఫామ్‌లో ఉన్నప్పుడు వ‌రుస గాయాలు ఇబ్బంది పెట్ట‌డంతో టెన్నిస్‌ను వ‌దిలేసిన డొమినిక్ థీమ్ రెండేళ్ల త‌ర్వాత స‌రికొత్తగా మారి ఫుట్‌బాల్ ఆట‌లో అడుగుపెడుతున్నాడు. మ‌రి ఫుట్‌బాల్‌లో డొమినిక్ థీమ్‌ మెరుస్తాడా లేదా అన్న‌ది చూడాలి.

చదవండి: ‘హ్యాండ్‌షేక్‌’ వివాదం.. రెండు నెలల తర్వాత నోరు విప్పిన హెడ్‌!

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)