Breaking News

ఎవరికీ భయపడేదే లేదు!.. వైభవ్‌ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు

Published on Thu, 07/30/2026 - 09:27

టీమిండియా యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ కేవ‌లం 15 వ‌య‌స్సులోనే త‌నకంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నిన్న‌టి వ‌ర‌కు జూనియ‌ర్ క్రికెట్ టోర్నీలు, ఐపీఎల్‌లో స‌త్తాచాటిన వైభ‌వ్‌.. ఇప్పుడు అంత‌ర్జాతీయ వేదిక‌పై త‌న మార్క్‌ను చూపించాడు.  ఇటీవ‌ల జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వైభ‌వ్ రెండు హాఫ్ సెంచ‌రీలు సాధించి ప్లేయ‌ర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు.

ఈ పర్యటనలో బ్లెస్సింగ్ ముజార్బానీ, రిచర్డ్ నగరావ వంటి స్టార్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కాగా సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనలతో భారత స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ స్ధానానికి ఎసరు పెట్టాడు. ఈ చిచ్చరపిడుగు ఎంట్రీతో సంజూ జట్టులో చోటు కోల్పోయాడు.

సెప్టెంబర్‌లో జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలకు సంజూ ఎంపికైనప్పటికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కుతుందన్న గ్యారెంటీ అయితే లేదు. ఇక జింబాబ్వే టూర్‌లో అదరగొట్టిన సూర్యవంశీ బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌ కోసం ఈస్ట్ జోన్ జట్టు వైస్ కెప్టెన్‌గా సూర్యవంశీ ఎంపికయ్యాడు. 

ఈ టోర్నీలో ఇషాన్ కిషన్‌కు డిప్యూటీగా సూర్య వంశీ వ్యవహరించనున్నాడు. బీసీసీఐ అతడిని అన్ని ఫార్మాట్ల ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే అతడికి వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. దీంతో సూర్యవంశీపై బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హర్ష్ వర్ధన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంత చిన్న వయస్సులోనే వైభవ్ సూర్యవంశీ ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్ కావడం బీహార్ క్రికెట్‌కు ఎంతో గర్వకారణమని హర్ష వర్ధన్ కొనియాడాడు,.

ఇక ఇది ఇలా ఉండగా.. ఈ బిహార్ వండర్ కిడ్ తాజాగా రాజస్తాన్ రాయల్స్ తరపున జడేజాతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వైభవ్‌కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. "మీరు ఏ బౌలర్‌ను ఎదుర్కోవడానికి భయపడతారు? అని హోస్ట్ వైభవ్‌ను ప్రశ్నించాడు. 

ఇందుకు వైభవ్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. "ఇప్పటి వరకు అయితే ఎవరికీ లేదు" అని నాలుగు పదాల్లో తేల్చి చేప్పేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్‌ రాయల్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కాగా సూర్యవంశీ ఐపీఎల్‌లో జస్ప్రీత్ బుమ్రా, హాజిల్‌వుడ్‌, కమిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం వదల్లేదు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)