Breaking News

టెన్నిస్‌లో అద్భుతం.. స‌బ‌లెంకాతో జ‌త క‌ట్ట‌నున్న జ‌కోవిచ్‌

Published on Tue, 07/28/2026 - 14:00

టెన్నిస్ ఆట‌లో ఒక అద్భుతం చోటుచేసుకుంది. సెర్బియా దిగ్గజం, 24 సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియ‌న్, మాజీ నంబ‌ర్‌వ‌న్ నొవాక్ జ‌కోవిచ్‌.. మ‌హిళ‌ల ప్ర‌పంచ నంబ‌ర్‌వ‌న్ అరీనా స‌బ‌లెంకాతో క‌లిసి యూఎస్ ఓపెన్ మిక్స‌డ్ డ‌బుల్స్‌లో జ‌త క‌ట్ట‌నున్నాడు. వీరితో పాటు టోర్నీలో బ‌రిలోకి దిగ‌నున్న 16 జ‌ట్ల జాబితాను ప్ర‌క‌టించారు. గ‌తేడాది యూఎస్ ఓపెన్‌కు ముందే టోర్నీని సమూలంగా మార్చారు. 

పురుషుల‌, మ‌హిళ‌ల విభాగంలో అగ్ర‌శ్రేణి సింగిల్స్ ఆట‌గాళ్లు మిక్స్‌డ్ డ‌బుల్స్‌లో జ‌త‌క‌ట్టి ఆడితే ఒక మిలియ‌న్ డాల‌ర్ల ప్రైజ్‌మ‌నీ అద‌నంగా ఇస్తామ‌ని యూఎస్ ఓపెన్ టెన్నిస్ అసోసియేష‌న్ (యూఎస్‌టీఏ) గ‌తేడాదే ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలోనే ఈసారి జ‌కోవిచ్‌, స‌బలెంకా క‌లిసి యూఎస్ ఓపెన్ మిక్సడ్ డ‌బుల్స్‌లో బ‌రిలోకి దిగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. 

ఈ ఇద్ద‌రితో పాటు 2025లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన ఇగా స్వియాటెక్‌, కాస్ప‌ర్ రూడ్ జంట‌తో పాటు ఎలెనా రైబాకినా-టేలర్ ఫ్రిట్జ్ , నవోమి ఒసాకా-కీ నిషికోరి, జెస్సికా పెగులా-జాక్ డ్రేపర్ మ‌రోసారి బరిలోకి దిగుతున్నారు . ప్రధాన డ్రా ఆగస్టు 25-26 తేదీల్లో రెండు రోజుల పాటు జరుగుతుంది. ఆర్థర్ ఆషే స్టేడియం, లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్టేడియంలో అన్ని మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఆగస్టు 17 వరకు జట్లు నమోదు చేసుకోవచ్చు. 

ఆరోజు వ‌ర‌కు అత్యుత్తమ సంయుక్త సింగిల్స్ ర్యాంకింగ్‌లు కలిగిన ఆరు జంటలు ఆటోమేటిక్‌గా మెయిన్ డ్రాలోకి ప్రవేశిస్తాయి. ఈ లెక్క‌న టాప్‌-10లో ఉన్న జ‌కోవిచ్‌, స‌బ‌లెంకా జోడి నేరుగా మెయిన్ డ్రాలో ప్ర‌వేశించ‌నుంది. దీంతో పాటు ఎనిమిది జట్లకు యూఎస్‌టీఏ వైల్డ్ కార్డ్‌లను ఇస్తుంది. మరో రెండు జట్లు ఆగస్టు 24న జరిగే క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ ద్వారా ఫైనల్స్‌కు చేరుకుంటాయి. 

అయితే గ‌తేడాది మిక్సడ్ డ‌బుల్స్ చాంపియ‌న్లుగా నిలిచిన సారా ఎర్రాని, ఆండ్రీ వ‌వ‌స్సోరిలు సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్‌-20లో లేక‌పోవ‌డంతో ఈ జంట మ‌రోసారి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వ‌నుంది. ఎనిమిది జట్లతో కూడిన క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌ను కూడా చేర్చారు, 

ఇందులో ఆరు జట్లకు నేరుగా ప్రవేశం, రెండు జట్లకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి. సెమీఫైనల్స్ వరకు, మ్యాచ్‌ల ఫార్మాట్ బెస్ట్-ఆఫ్-త్రీ-సెట్స్ పద్ధతిలో ఉంటుంది. ఇందులో సెట్‌లు నాలుగు గేమ్‌లకు, 4-ఆల్ వద్ద టైబ్రేకర్లు, మూడవ సెట్‌కు బదులుగా 10-పాయింట్ల మ్యాచ్ టైబ్రేక్ ఉంటాయి. ఫైనల్ స్టాండర్డ్ స్కోరింగ్ పద్ధతిలో ఉంటుంది, ఇందులో సెట్‌లు ఆరు గేమ్‌లకు, 6-ఆల్ వద్ద టైబ్రేకర్,  అవసరమైతే 10-పాయింట్ల మ్యాచ్ టైబ్రేకర్ ఉంటాయి.

 

Read: సుందర్‌ స్థానంలో జట్టులోకి.. ఎవరీ సారాన్ష్‌ జైన్‌?

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)