Breaking News

క్రిస్‌ గేల్‌ కాళ్లు మొక్కిన బ్రావో.. వీడియో వైరల్‌

Published on Sat, 07/18/2026 - 19:33

అమెరికా వేదికగా మేజర్‌ క్రికెట్‌ లీగ్‌ (ఎంఎల్‌సీ)-2026 తుది అంకానికి చేరుకుంది. ఒక్లాండ్‌ వేదికగా శనివారం రాత్రి లాస్‌ ఏంజెల్స్‌ నైట్‌ రైడర్స్‌- వాషింగ్టన్‌ ఫ్రీడం టైటిల్‌ పోరులో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో మెగా ఫైనల్‌కు ముందు ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

క్రిస్‌ గేల్‌ కాళ్లు మొక్కిన బ్రావో
లాస్‌ ఏంజెల్స్‌ నైట్‌ రైడర్స్‌ హెడ్‌కోచ్‌ డ్వెయిన్‌ బ్రావో.. యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ను కలుసుకున్నాడు. ఈ సందర్భంగా గేల్‌ను ఆహ్వానిస్తూ అతడి పాదాలకు నమస్కరించాడు బ్రావో. అంతేకాదు యూనివర్సల్‌ బాస్‌ను అక్కడున్న వారికి చూపిస్తూ.. ‘Original GOAT’ (అసలైన గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌)గా అభివర్ణించాడు.

ఈ క్రమంలో గేల్‌ బ్రావో ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు.  ఈ ఇద్దరు వెస్టిండీస్‌ దిగ్గజాలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా బ్రావో మార్గదర్శనంలో లాస్‌ ఏంజెల్స్‌ నైట్‌ రైడర్స్‌ MLCలో తొలిసారి ప్లే ఆఫ్స్‌ చేరడమే కాకుండా.. ఏకంగా ఫైనల్లోనూ అడుగుపెట్టింది.

విండీస్‌ వీరులదే హవా
క్వాలిఫయర్‌-1లో ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌ను ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఇందులో వెస్టిండీస్‌ స్టార్‌ ఆండ్రీ రసెల్‌ది కీలక పాత్ర. సీజన్‌ ఆసాంతం.. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో అద్భుతమైన బౌలింగ్‌తో రసెల్‌ ఆకట్టుకున్నాడు. వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు.

ఇప్పటికి పది మ్యాచ్‌లలో కలిపి రసెల్‌ 18 వికెట్లు కూల్చాడు. ఇక లాస్‌ ఏంజెల్స్‌ జట్టుకు మరో విండీస్‌ ఆటగాడు జేసన్‌ హోల్డర్‌ కెప్టెన్‌గా ఉండటం విశేషం. ఇక విండీస్‌ మరో ప్లేయర్‌ సునిల్‌ నరైన్‌ సైతం ఈ సీజన్‌లో అత్యుత్తమంగా బౌలింగ్‌ చేశాడు. మరోవైపు.. రోవ్‌మన్‌ పావెల్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో తనదైన శైలిలో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చి మ్యాచ్‌లు గెలిపించాడు.

మొత్తంగా విండీస్‌ వీరులంతా కలిసి తొలిసారి లాస్‌ ఏంజెల్స్‌ జట్టును తొలిసారి ఫైనల్‌కు చేర్చగా.. క్రిస్‌ గేల్‌ వారిని ఉత్సాహపరిచేందుకు మైదానానికి వచ్చినట్లు తెలుస్తోంది. గేల్‌- బ్రావోకు సంబంధించిన మూమెంట్స్‌ అభిమానులు తెగ ఆకర్షిస్తున్నాయి.

ఇద్దరూ ఇద్దరే..
కాగా 42 ఏళ్ల బ్రావో వెస్టిండీస్‌ తరఫున 2004- 2021 మధ్య అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు. మొత్తంగా 40 టెస్టులు, 164 వన్డేలు, 91 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 2200, 2968, 1255 పరుగులు సాధించాడు. ఈ రైటార్మ్‌ పేస్‌ బౌలర్‌ ఖాతాలో టెస్టుల్లో 86, వన్డేల్లో 199, టీ20లలో 78 వికెట్లు ఉన్నాయి.

మరోవైపు.. 46 ఏళ్ల క్రిస్ గేల్‌ 1999- 2021 మధ్య విండీస్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు. 103 టెస్టులు, 301 వన్డేలు, 79 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. టెస్టుల్లో 7215, వన్డేల్లో 10480, టీ20లలో 1899 పరుగులు రాబట్టాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌ నైపుణ్యాలతో యూనివర్సల్‌ బాస్‌గా గేల్‌ గుర్తింపు పొందాడు.

చదవండి: IND vs ENG: వాషీ అవుట్‌.. రీప్లేస్‌మెంట్‌ను ప్రకటించిన బీసీసీఐ

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)